IPL 2022 FROM RASHID TO RAVI KUMAR THESE EIGHT INDIAN PLAYERS NOT SHORTLISTED FOR MEGA AUCTION DUE TO THIS REASON SRD
IPL 2022 : తెలుగు తేజంతో రషీద్ తో పాటు అండర్-19 కుర్రాళ్లకు బీసీసీఐ షాక్.. మెగావేలం నుంచి ఔట్..!
U-19 Team India Players
IPL 2022 : ఈ ధనాధన్ లీగ్ కోసం 1214 మంది ప్లేయర్లు ఆసక్తి కనబర్చగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో అండర్ వరల్డ్ కప్ చాంపియన్స్‌కు చోటు దక్కలేదు.
ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌లో (World Cup) యువ భారత్ సత్తా చాటింది. మరోసారి ట్రీఫీని తన ఖాతాలో వేసుకున్న యంగ్ ఇండియన్ ప్లేయర్లు(Young Indian Players), తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకోవడంపై దృష్టి సారించారు. మెగాటోర్నీలో ఆడిన చాలా మంది కుర్రాళ్ల ఐపీఎల్ వేలం (IPL Mega Auction)లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఐపీఎల్ వేలంలో తమ టాలెంట్ కు సరియైన ప్రతిఫలం దక్కుతుందని భావించారు. అయితే.. తమ దుమ్మురేపే ప్రదర్శనతో టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన 8 మంది భారత యువ ఆటగాళ్లకు ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో అవకాశం దక్కలేదు. ఈ ధనాధన్ లీగ్ కోసం 1214 మంది ప్లేయర్లు ఆసక్తి కనబర్చగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో అండర్ వరల్డ్ కప్ చాంపియన్స్‌కు చోటు దక్కలేదు. తెలుగు తేజం 17 ఏళ్ల షేక్ రషీద్ (Shaik Rashid)తో పాటు మరో 8 మంది ఈ లిస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఐపీఎల్ లీగ్ నిబంధనల ప్రకారమే ఈ 8 మంది ఆటగాళ్లను మెగా వేలం షార్ట్ లిస్ట్ నుంచి తొలిగించారు.
ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనే ఆటగాళ్లు 19 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. అండర్ 19 ఆటగాళ్లు అయితే ఆయా రాష్ట్రాల జట్ల తరఫున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ, లిస్ట్ ఏ గేమ్ కానీ ఆడి ఉండాలి. అయితే షేక్ రషీద్‌తో పాటు హర్యానాకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ బానా, అంగ్క్రిష్ రఘు వంశీ, మనవ్ పరాక్, నిషాంత్ సింధు, గ్రావ్ సంగ్వాన్, రవి కుమార్, సిద్ధార్థ్ యాదవ్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో పాటు లిస్ట్ ఏ గేమ్ ఆడలేదు.
దీంతో, వారు మెగావేలం షార్ట్ లిస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇక కరోనా కారణంగా దేశవాళీ అండర్ 19 క్రికెట్ టోర్నీలతో పాటు సీనియర్ లెవల్ టోర్నీలు వాయిదా పడటంతో చాలా మంది యువ ఆటగాళ్లు లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. దీంతో, ఈ 8 ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని, నిబంధనలను మార్చి ఈ టాలెంటెడ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.
" ఈ రూల్స్ కారణంగా ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఐపీఎల్ కాంట్రాక్టులు కోల్పోవడం బాలేదు. బీసీసీఐ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేయాలని. ఐపీఎల్ మెగావేలంలో ఈ యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి" అని బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ షెట్టీ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ బీసీసీఐ.. పై నిబంధనలను సడిలిస్తే మాత్రం రషీద్ తో పాటు మిగిలిన ఏడుగురు క్రికటర్లు వేలంలోకి వస్తారు. ఆసక్తి ఉన్న ఫ్రాంచైజీలు ఈ యువ క్రికెటర్లను దక్కించుకునే అవకాశం కూడా ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.