IPL 2022 FORMER INDIAN CRICKETER VIRENDER SEHWAG FACES HEAT ON SOCIAL MEDIA BY ROHIT SHARMA FANS AFTER HIS VADAPAV TWEET SRD
Virendra Sehwag : సెహ్వాగ్ వర్సెస్ రోహిత్ ఫ్యాన్స్.. వడాపావ్ ట్వీట్ పై రచ్చ.. చివరికి కూల్ అంటూ వీరూ కౌంటర్..
వీరేంద్ర సెహ్వాగ్ (ఫైల్ ఫొటో)
Virendra Sehwag : ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు సెహ్వాగ్. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటాడు. సెహ్వాగ్ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు.
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag). ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటాడు. సెహ్వాగ్ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక, లేటెస్ట్ గా వీరేంద్ర సెహ్వాగ్ పై రోహిత్ (Rohit Sharma) ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారు. ఇంతకీ సెహ్వాగ్ పై వారు ఎందుకు కోపంగా ఉన్నారంటే.. ఐపీఎల్ 2022లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) గురించి ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ చేసిన కామెంట్లే ఈ మొత్తం వివాదానికి కారణమైంది. ఇంతకీ సెహ్వాగ్ ఏమన్నాడంటే...
ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ప్యాట్ కమిన్స్ వీర బాదుడు గురించి తెలిసిందే. 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి ముంబైకి పీడ కల మిగిల్చాడు. దీనిపైనే సెహ్వాగ్ కామెంట్ చేశాడు. " నోటికాడి కూడును లాగేసుకున్నాడు.. సారీసారీ వడాపావ్ లాగేసుకున్నాడు. వీరబాదుడుతో ప్యాట్ కమిన్స్ 15 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు " అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై వెంటనే రోహిత్ ఫ్యాన్స్ స్పందించారు. సెహ్వాగ్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు.
Moonh se nivala cheen liya ,, sorry vada pav cheen liya.
Pat Cummins, one of the most insane display of clean hitting , 15 ball 56 …
Jeera Batti #MIvKKRpic.twitter.com/Npi2TybgP9
The Vada Pav reference is for Mumbai, a city which thrives on Vada Pav. Rohit fans thanda lo , I am a bigger fan of his batting much more than most of you guys.
దీంతో సెహ్వాగ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ కు అందరికన్నా తానే పెద్ద అభిమానినని, రోహిత్ బ్యాటింగ్ చాలా ఇష్టమని మరో ట్వీట్ చేశాడు. తాను కేవలం ముంబైకి సూచికగానే వడాపావ్ అన్నానని, రోహిత్ ను అనలేదని, హిట్ మ్యాన్ అభిమానులంతా కాస్తంత చల్లబడాలని ట్వీట్ చేశాడు.
ముంబై ఇండియన్స్‌పై పాట్ కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. 373 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 19 నిమిషాల్లో కమిన్స్ సునామీ సృష్టించాడు. ప్యాట్ కమిన్స్‌పై కోల్కత్తా జట్టు యజమాని షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు మాజీలు పొగడ్తల వర్షం కురిపించారు. ప్యాట్ కమిన్స్ విధ్వంసంతో ముంబై ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. ఈ విజయంతో కేకేఆర్ నాలుగు మ్యాచుల్లో మూడు విక్టరీలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసుని కైవసం చేసుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.