హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : ఏప్రిల్ 25కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య రిలేషన్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. కానీ తొలిసారి..

IPL 2022 : ఏప్రిల్ 25కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య రిలేషన్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. కానీ తొలిసారి..

చెన్నై సూపర్ కింగ్స్ (PC: CSK TWITTER)

చెన్నై సూపర్ కింగ్స్ (PC: CSK TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో గెలుపోటములను ఆటగాళ్ల ప్రదర్శనే కాదు తేదీలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కాస్త విచిత్రంగా.. నమ్మలేనట్లుగా ఉన్నా ఇది నిజం. ఏప్రిల్ 23న మ్యాచ్ అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నుంచి ఏదో ఒక రికార్డు ఎలా వస్తుందో ఇది వరకే చూశాం.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో గెలుపోటములను ఆటగాళ్ల ప్రదర్శనే కాదు తేదీలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కాస్త విచిత్రంగా.. నమ్మలేనట్లుగా ఉన్నా ఇది నిజం. ఏప్రిల్ 23న మ్యాచ్ అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నుంచి ఏదో ఒక రికార్డు ఎలా వస్తుందో ఇది వరకే చూశాం. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ఇప్పటి వరకు ఏప్రిల్ 23న మూడు మ్యాచ్ లు ఆడితే.. అందులో మూడు సార్లు కూడా రికార్డులను సెట్ చేసిన విషయం తెలిసిందే. 2013 ఏప్రిల్ 23న పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ కొట్టలేకపోయారు. ఇక 2017లో ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్ లో ఇదే ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 23న సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ లో ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి : ధోని ఖాతాలో మరో రికార్డు.. ఈ ఐపీఎల్ లో తగ్గేదే లే అంటోన్న మిస్టర్ కూల్

ఇక తాజాగా ఇటువంటి సెంటిమెంట్ నే చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాటిస్తోంది. ఈ సీజన్ ముందు వరకు కూడా ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్ లన్నింటిలోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 2021 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 25న 7 మ్యాచ్ లు ఆడగా.. ఏడింటిలోనూ గెలుపొందింది. ముంబై ఇండియన్స్ (2010), పుణే వారియర్స్ ఇండియా (2011),  సన్ రైజర్స్ హైదరాబాద్ (2013), ముంబై ఇండియన్స్ (2014), కిింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2015), ఆర్సీబీ (2018), ఆర్సీబీ (2021)లపై ఏప్రిల్ 25న మ్యాచ్ లు ఆడి గెలుపొందడం విశేషం. అయితే ఈ విక్టరీల రికార్డు ఈ ఏడాదితో తెరపడింది. ఈ సీజన్ లో ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో తొలిసారి ఏప్రిల్ 25 చెన్నై టీంను ముంచేసింది.

సోమవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్)పై 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.  188 పరుగుల లక్ష్యంతో  బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. అంబటి రాయుడు (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. పంజాబ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో రాయుడి చేతికి గాయం అయ్యింది. దాంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఛేదనలో గాయంతోనే ఆడిన రాయుడు అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా రాయుడు వల్లనే చెన్నై మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ (30) పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (59 బంతుల్లో 88 నాటౌట్ ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, MS Dhoni, Royal Challengers Bangalore, Shikhar Dhawan, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు