IPL 2022 FOR ROHIT SHARMA COOL GESTURE TOWARDS PITCH INVADER IMPRESSES VIRAT KOHLI WATCH KING APPRECIATION SRD
IPL 2022 - Viral Video : క్యా సీన్ హై.. మైదానంలోకి రోహిత్ ఫ్యాన్.. ఆ టైంలో హిట్ మ్యాన్ చేసిన పనికి కోహ్లీ ఫిదా..
Virat Kohli - Rohit Sharma
IPL 2022 - Viral Video : శనివారం నాడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా... విరాట్ కోహ్లీ టీం రోహిత్ టీంపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో రోహిత్ శర్మ 26 పరుగులు చేస్తే... కోహ్లీ 48 పరుగులు చేశాడు. ఇక, ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ ఇద్దరే. ఒంటి చేత్తో విజయాలను అందించడంలో వీరికి వీరే సాటి. గతంలో టీమిండియా (Team India)ను విరాట్ కోహ్లీ నడిపిస్తే... ఇప్పుడు రోహిత్ శర్మ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కాస్త కష్టమే అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథిగా రోహిత్ కొనసాగుతుంటే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)లో కీలక ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తుంటే... రోహిత్ మాత్రం ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు.
శనివారం నాడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడగా... విరాట్ కోహ్లీ టీం రోహిత్ టీంపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో రోహిత్ శర్మ 26 పరుగులు చేస్తే... కోహ్లీ 48 పరుగులు చేశాడు. ఇక, ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కెప్టెన్ గా ఈ మ్యాచులో ఓడినా.. తన హుందాతనంతో ప్రశంసలు అందుకున్నాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు హిట్ మ్యాన్. అదే సమయంలో సెక్యూరిటీ కళ్లు గప్పి ఓ అభిమాని రోహిత్ వైపు దూసుకొచ్చాడు. హగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. మామూలు రోజుల్లో రోహిత్ ఇచ్చేవాడేమో? అయితే కరోనా నేపథ్యంలో కాస్త పరిణతితో ఆలోచించాడు.
ఆ అభిమాని తనవైపు వస్తుండటం చూసి.. మైదానం వెళ్లిపోవాలని అతడికి సూచించాడు. అతడు మాత్రం హగ్ కోసం రోహిత్ వైపే వెళ్తున్నాడు. అయితే ఇది కరోనా టైం అని.. వర్చువల్ హగ్ ఇస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ ఫ్యాన్ కూడా చేతులు చాచి ఆనందంగా వెనక్కివెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అభిమానిని రోహిత్ డీల్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యాడు. రోహిత్ వైపు చూసి క్లాప్స్ కొడుతూ అభినందిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఈ వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 పరుగులు ; 5 ఫోర్లు,6 సిక్సర్లు ) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేజింగ్ కు దిగిన బెంగళూరు టీం 18.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసి గెలుపొందింది. అనూజ్ రావత్ ( 47 బంతుల్లో 66 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 36 బంతుల్లో 48 పరుగులు ; 5 ఫోర్లు) రాణించాడు. సీజన్ లో బెంగళూరుకు ఇది హ్యాట్రిక్ విజయం కాగా... ముంబై జట్టుకు వరుసగా నాలుగో పరాజయం.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.