Trent Boult : రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన క్వాలిఫయర్ 2లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంకు వెళ్తూ బౌల్ట్ బుడ్డోడి కోరిక తీర్చాడు. డ్రెస్సింగ్ రూంకు వెళ్లే సమయంలో ఓ పిల్లోడు బౌల్ట్ ను ఆపి.. తనకు జెర్సీ కావాలని కోరాడు. వెంటనే బౌల్ట్ తాను వేసుకున్న జెర్సీని తీసి ఆ బుడ్డోడికి ఇచ్చాడు. జెర్సీ అందుకున్న ఆ పిల్లవాడు అప్పటి వరకు తాను ధరించిన ఆర్సీబీ జెర్సీని తొలగించేసి బౌల్ట్ ఇచ్చిన జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ టీం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి : మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మహా సంగ్రామం.. రాజస్తాన్ ఆశలన్నీ ఈ నలుగురు ప్లేయర్లపైనే..
ఇక నేటి రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే ఐపీఎల్ తుది పోరులో రాజస్తాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి.గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆల్ రౌండ్ పర్ఫామెన్స్. హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్ లతో గుజరాత్ బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్ లోనూ గుజరాత్ దుమ్మురేపుతోంది. మహ్మద్ షమీ, లూకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్ ఆ జట్టుకు పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు.టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది.
How can you not love Trent Boult? 😍
Watch him make a young fan's day after #RRvRCB. 💗 pic.twitter.com/YrWgRsAgsN
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022
ఆ జట్టులో టాప్ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్యా 453 పరుగులతో 6వ స్థానంలో నిలిచాడు. 438 రన్స్‌తో శుభ్‌మన్ గిల్ 10వ స్థానంలో నిలిచాడు. గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ హిట్టర్లు.. స్ట్రోక్ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. డేవిడ్ మిల్లర్ కూడా ఆడిన 15 మ్యాచుల్లో 449 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు ఇక, ఇప్పటివరకు రషీద్ ఖాన్ ఆడిన 15 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. షమీ 15 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి బౌలింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson