హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 Final : మహాసమరానికి సర్వం సిద్ధం.. రెండు జట్ల బలబలాలు.. తుది జట్లు ఇవే..!

IPL 2022 Final : మహాసమరానికి సర్వం సిద్ధం.. రెండు జట్ల బలబలాలు.. తుది జట్లు ఇవే..!

IPL 2022 Final

IPL 2022 Final

IPL 2022 Final : ఇక, ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ దే పై చేయి. లీగ్‌ స్టేజ్‌లో గుజరాతే గెలిచింది. ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. అది గుజరాతే గెలిచింది. ఇక, క్వాలిఫయర్ -1 లో కూడా రాజస్థాన్ ను చిత్తు చేసి ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

ఐపీఎల్‌ 2022(IPL 2022) చివరి ఘట్టానికి చేరుకుంది. 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ (IPL 2022 Final) కి రంగం సిద్ధమైంది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) టగ్ ఆఫ్ వార్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయ్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజీలో ఈ రెండు జట్లు అదరగొట్టాయ్. 14 మ్యాచ్‌ లు ఆడిన గుజరాత్‌.. పదింట్లో గెలిచింది. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం తొమ్మిది మ్యాచుల్లో విజయంసాధించింది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తుది జట్లు, హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి.గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆల్‌ రౌండ్‌ పర్ఫామెన్స్‌. హార్ధిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్‌ లతో గుజరాత్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్‌ లోనూ గుజరాత్‌ దుమ్మురేపుతోంది. మహ్మద్‌ షమీ, లూకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ ఆ జట్టుకు పెద్ద అసెట్‌ అని చెప్పుకోవచ్చు.టాపార్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది.

ఆ జట్టులో టాప్‌ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్యా 453 పరుగులతో 6వ స్థానంలో నిలిచాడు. 438 రన్స్‌తో శుభ్‌మన్‌ గిల్ 10వ స్థానంలో నిలిచాడు. గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ హిట్టర్లు.. స్ట్రోక్‌ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. డేవిడ్ మిల్లర్ కూడా ఆడిన 15 మ్యాచుల్లో 449 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు ఇక, ఇప్పటివరకు రషీద్‌ ఖాన్‌ ఆడిన 15 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. షమీ 15 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి బౌలింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి : తల్లి మృత్యువుతో పోరాటం.. కొడుకు మైదానంలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్

ఇక రాజస్థాన్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కీ ప్లేయర్‌ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 మ్యాచ్‌ లు ఆడిన బట్లర్‌ 824 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్‌, కెప్టెన్‌ సంజూ సాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, హెట్‌ మెయిర్‌, రియాన్‌ పరాగ్‌ లతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఫుల్‌ స్ట్రాంగ్‌ గా కనిపిస్తోంది.

అటు బౌలింగ్‌ విభాగంలో రాజస్థాన్‌ అదరగొడుతోంది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ (26) సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. స్పిన్నర్‌ అదరగొడుతున్నాడు. 16 మ్యాచులు ఆడిన చాహల్‌ 26 వికెట్లు తీసి ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో అశ్విన్ పరుగులు నియంత్రిస్తూ ప్రత్యర్ధుల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు.

ఇది కూడా చదవండి : పోయి పోయి ఆర్సీబీనే నమ్ముకున్నావా.? ఇక నీకు ఈ జన్మలో పెళ్లి అయినట్లే!

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఇక, ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ దే పై చేయి. లీగ్‌ స్టేజ్‌లో గుజరాతే గెలిచింది. ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. అది గుజరాతే గెలిచింది. ఇక, క్వాలిఫయర్ -1 లో కూడా రాజస్థాన్ ను చిత్తు చేసి ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.

తుది జట్లు అంచనా :

గుజరాత్ టైటాన్స్ : సాహా, శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యశ్ దయాల్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, మొహమ్మద్ షమీ,

రాజస్తాన్ రాయల్స్ : జాస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ సామ్సన్ (కెప్టెన్), పడిక్కల్, షిమ్రన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్.

First published:

Tags: Cricket, Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Mohammed Shami, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు