Home /News /sports /

IPL 2022 FINAL GT VS RR LIVE SCORE UPDATES GUJARAT TITANS WON BY 7 WICKETS AND HARDIK PANDYA ALL ROUND SHOW SRD

IPL 2022 Final : నయా చాంపియన్ ఆగయా.. గుజరాత్ దే రాజసం.. హార్దిక్ ఆల్ రౌండ్ షో..

IPL 2022 Final

IPL 2022 Final

IPL 2022 Final : ఐపీఎల్ లో కొత్త చాంపియన్ అవతరించింది. సీజన్ ఫస్ట్ నుంచి అదిరిపోయే ఆటతో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ కే ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ దక్కింది.

    మెగాటోర్నీలో కొత్త ఛాంపియన్ అవతరించింది. ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ అద్బుతం చేసి చూపించింది. ఫస్ట్ నుంచి సూపర్ ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ నాకౌట్ మ్యాచుల్లో కూడా తమకు తిరుగులేదని నిరూపించింది. 131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో.. ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. గిల్ ( 43 బంతుల్లో 45 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్), మిల్లర్ (19 బంతుల్లో 32 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ద్, చాహల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నాడు. చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇక, ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్ (863) పరుగులు.. ఆరెంజ్ క్యాప్ దక్కింది.

    131 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కి రాజస్థాన్ బౌలర్లు కూడా చుక్కలు చూపించారు. తొలి బంతి నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఇక, సాహా రూపంలో ఆ జట్టుకు తొలి షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన సాహా.. ప్రసిద్ధ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే.. మాథ్యూ వేడ్ (8) కూడా బౌల్ట్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే... కష్టాల్లో పడ్డ గుజరాత్ ఇన్నింగ్స్ ను హార్దిక్, గిల్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకువెళ్లారు.

    ఇక, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. రన్ రేట్ పెరగకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మూడో వికెట్ కు 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని చాహల్ విడదీశాడు. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) ని ఓ అద్భుత బంతికి పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో.. 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో గిల్.. అతనికి సహకరించాడు. మిల్లర్ వీలు చిక్కినప్పడల్లా బౌండరీలు బాది.. స్కోరు బోర్డు ప్రెజర్ లేకుండా చూసుకున్నాడు. ఇక, ఆఖర్లో సునాయాసంగా విజయాన్ని సాధించింది గుజరాత్.

    అంతకుముందు.. మెగా ఫైట్ లో రాజస్తాన్ బ్యాటర్లు తడబడ్డారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ లో రాజస్తాన్ సాధారణ స్కోరుకు పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. బట్లర్ (35 బంతుల్లో 39 పరుగులు ; 5 ఫోర్లు) ఫర్వాలేదన్పించాడు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. ఇక, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. సంజూ, బట్లర్, హెట్మెయర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లు తీసి.. ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు హార్దిక్. సాయి కిషోర్ రెండు వికెట్లతో రాణించాడు. రషీద్ ఖాన్, యష్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Rajasthan Royals, Sanju Samson

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు