Home /News /sports /

IPL 2022 FINAL FANS SLAMS RAJASTHAN ROYALS CAPTAIN FOR ELECTING BAT AFTER WINNING THE TOSS SJN

IPL 2022 Final : రాజస్తాన్ ను పెడదారి పట్టించిన కామెంటేటర్లు.. అందుకే ఫైనల్లో అలా?

సంజూ సామ్సన్ (PC : TWITTER)

సంజూ సామ్సన్ (PC : TWITTER)

IPL 2022 Final :  రెండు నెలలకు పైగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా.. అది కూడా ఆడుతున్న తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అదరగొట్టేసింది.

IPL 2022 Final :  రెండు నెలలకు పైగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా.. అది కూడా ఆడుతున్న తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అదరగొట్టేసింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీలోని ఆ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా చాంపియన్ గా నిలిచింది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా ఈ సీజన్ లో మంచి ప్రదర్శనే చేసింది. అయితే చివరి మెట్టుపై చతికిలపడింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఓడిపోవడానికి టాస్ కీలక పాత్ర పోషించిందనేది వాస్తవం. అయితే టాస్ విషయంలో రాజస్తాన్ ను ఎవరైనా పక్కదారి పట్టించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐపీఎల్ తాజా సీజన్ లో టాస్ కీలక పాత్ర పోషించదనేది వాస్తవం. ఎక్కువ సార్లు టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ఆ తర్వాత టార్గెట్ ను ఛేజ్ చేసి విజేతగా నిలిచాయి. ఇక ప్లే ఆఫ్స్ విషయానికి వస్తే ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన రెండు సార్లు (క్వాలిఫయర్ 1, 2)లలో చేజ్ చేసిన జట్లే విజేతగా నిలిచాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2లో ఆర్సీబీ విసిరిన లక్ష్యాన్ని రాజస్తాన్ ఆడుతూ పాడుతూ చేధించిన సంగతి తెలిసిందే. ఇన్ని తెలిసి కూడా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ టాస్ గెలిచిన తర్వాత ఎందుకు బ్యాటింగ్ తీసుకున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే మ్యాచ్ కు ముందు జరిగిన పిచ్ రిపోర్ట్ లో కామెంటేటర్ మాట్లాడుతూ.. క్వాలిఫయర్ 2లో ఉపయోగించిన పిచ్ పైనే ఫైనల్ కూడా జరుగుతుందని పేర్కొన్నాడు. అదే సమయంలో రెండో బ్యాటింగ్ కు పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు.



దాంతో టాస్ గెలిచిన సంజూ సామ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ సమయంలో హార్దిక్ మాట్లాడుతూ తాము టాస్ గెలిచింటే ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని చెప్పడం విశేషం. టాస్ నెగ్గిన సామ్సన్ తొలుత బ్యాటింగ్ చేస్తున్నానని చెప్పడంతో చాలా మంది షాక్ గురయ్యారనేది వాస్తవం.  ఏదీ ఏమైనా కీలక మ్యాచ్ లో అతి కీలకమైన టాస్ ను రాజస్తాన్ నెగ్గినా.. అనాలోచిత నిర్ణయంతో మరోసారి ఐపీఎల్ చాంపియన్ గా రెండోసారి నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mohammed Shami, Rajasthan Royals, Rashid Khan, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు