Home /News /sports /

IPL 2022 FANS SLAM CHENNAI SUPER KINGS OVER AMBATI RAYUDU CONTROVERSIAL RETIREMENT TWEET AND DELETING THE TWEET SJN

IPL 2022 : ’ఆ చెత్త టీంను బ్యాన్ చేయండి.. ఎప్పుడూ వివాదాలే.. విసిగిపోయాం‘ విఖ్యాత టీంపై ఫ్యాన్స్ ఫైర్ అసలేం జరిగిందంటే?

Chennai Super Kings (IPL Twitter)

Chennai Super Kings (IPL Twitter)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ఘనమైన చరిత్రే ఉంది. ఐపీఎల్ లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైకి పేరుంది.

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ఘనమైన చరిత్రే ఉంది. ఐపీఎల్ లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైకి పేరుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తర్వాత ఐపీఎల్ టైటిల్ ను రికార్డు స్థాయిలో నాలుగు సార్లు సొంతం చేసుకుంది. 2020, 2022 సీజన్ లలో మినహా 2008 నుంచి ఆడిన ప్రతి సీజన్ లో నూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తూ వస్తోంది. అయితే ఈ సీజన్ లో చెన్నై ఆటతీరుతో పాటు మేనేజ్ మెంట్ విషయాలు వివాదానికి కారణం అయ్యాయి. ఈ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ధోని స్థానంలో రవీంద్ర జడేజా కెప్టెన్ గా సీజన్ తొలి అర్ధ భాగానికి వ్యవహరించాడు.

ఇది కూడా చదవండి  : ఏందీ మైండ్ దొబ్బిందా.. సీఎస్కే సీఈవో ఏంటీ రాయుడ్ని ఇంత మాట అనేశాడు..!

అయితే చెన్నై చెత్త ప్రదర్శన కనబర్చడంతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకొని తిరిగి ధోనికే అప్పగించాడు. అనంతరం గాయంతో తాను సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అనంతరం రవీంద్ర జడేజా ఇన్ స్టాగ్రామ్ ఖాతాను సీఎస్కే అన్ ఫాలో చేసింది. దాంతో జడేజాకు సీఎస్కే యాజమాన్యానికి చెడిందనే వార్తలు వచ్చాయి. ఇక శనివారం  అంబటి రాయుడు ఇదే తనకు ఆఖరి ఐపీఎల్ సీజన్ అంటూ ట్వీట్ చేశాడు. మరికాసేపటికే ఆ ట్వీట్ ను అంబటి రాయుడు డిలీట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. అసలు అంబటి రాయుడు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే అంశాలపై క్లారిటీ లేక ఫ్యాన్స్ తమలో తాము చర్చించుకోవడం మొదలు పెట్టారు.

తాజాగా ఫ్యాన్స్ చెన్నై జట్టును తిడుతూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017 సీజన్లలో చెన్నై బ్యాన్ అయిందని, ఆ తర్వాత 2020లో సురేశ్ రైనా విషయంలో కాంట్రవర్సీ, 2022 సీజన్ లో కెప్టెన్సీ విషయంలో గందరగోళం, సురేశ్ రైనాను వేలంలో కొనకపోవడం, జడేజా విషయంలో కాంట్రవర్సీ, రాయుడు రిటైర్మెంట్ విషయంలో మరో కాంట్రవర్సీ అంటూ ట్వీట్ చేశాడు. క్రికెట్ క్లీన్ గా ఉండాలంటే సీఎస్కేపై శాశ్వతంగా బ్యాన్ విధించాలంటూ కామెంట్స్ కూడా చేశాడు.





చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ రాయుడు రిటైర్మెంట్ పై  ఓ ప్రముఖ చానెల్ తో ఫోన్ లో మాట్లాడాడు. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేశాడు. అంబటి రాయుడు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యాడని అందుకే సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించినట్లు పేర్కొన్నాడు. అయితే అతడితో తాము మాట్లాడినట్లు తమ మాట విని రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నట్లు విశ్వనాథన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథన్ చేసిన మరో కామెంట్ చర్చకు తావిచ్చేలా ఉంది. అదేంటంటే.. ఈ సీజన్ లో అంబటి రాయుడు తన ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్నట్లు.. అందుకే పొరపాటున రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడని అతడు అన్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, Csk, IPL, IPL 2022, Kolkata Knight Riders, MS Dhoni, Ravindra Jadeja, Shreyas Iyer, Sunrisers Hyderabad, Suresh raina

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు