హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: మురుకులు తిన్నాడని రూ. 13 లక్షలు ఫైనా..? ఇదెక్కడి న్యాయంరా అయ్యా?

IPL 2022: మురుకులు తిన్నాడని రూ. 13 లక్షలు ఫైనా..? ఇదెక్కడి న్యాయంరా అయ్యా?

పృథ్వీ షా

పృథ్వీ షా

IPL 2022 : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw)కి అంపైర్లు భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw)కి అంపైర్లు భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే 196 పరుగుల విజయ లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కు దిగగా.. పృథ్వీ షా కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్ లో పృథ్వీ షా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నిబంధనలను ఉల్లంఘించాడని పేర్కొన్న మ్యాచ్ రిఫరీ.. పృథ్వీ షా మ్యాచ్ ఫీజులోంచి 25 శాతం (రూ. 13 లక్షలు) కోత విధించారు. అయితే పృథ్వీ షా చేసిన తప్పిదం ఏంటో ఆ ప్రకటనలో వెల్లడించలేదు. అతను ఎక్కడ నియమ నిబంధనల్ని ఉల్లఘించాడనే విషయంపై స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి : కొత్త పెళ్లి కొడుకా మజాకా.. ఫ్లయిట్ దిగగానే వీర కొట్టుడు కొట్టాడు.. అతడెవరంటే?

దుష్మంత చమీర బౌలింగ్ లో తక్కువ స్కోరుకే అవుటైన పృథ్వీ షా ఎటువంటి ఎక్స్ ట్రాలు చేయకుండా పెవలియన్ కు చేరుకున్నాడు. అవుటయ్యాక ప్రత్యర్థి ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడం కానీ, అంపైర్లతో వాగ్వివాదం చేయడం కానీ చేయలేదు. అదే సమయంలో డగౌట్ కు చేరే క్రమంలో బౌండరీ లైన్ ను బ్యాట్ తో బాదడం వంటి పనులు కూడా చేయలేదు. అయినా కూడా అంపైర్లు అతడికి ఫైన్ ఎందుకు విధించారో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో పృథ్వీ షా జరిమానా విషయంలో పలువురు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో జోక్స్ వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : రెండు స్థానాలు.. రేసులో ఏడు జట్లు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు ఏవంటే?

పృథ్వీ షా తిండి ప్రియుడని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఫిట్ గా కూడా కనిపించడు. ఇప్పుడు దీనిపైనే క్రికెట్ అభిమానులు జోక్స్ వేస్తున్నారు. ఒక అభిమాని అయితే ’ఆట మధ్యలో పృథ్వీ షా జేబులోంచి మురుకులు తీసి తిన్నాడు. అందుకే రిఫీరీ జరిమానా విధించాడు.‘ అని ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూసేయండి

ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో  3 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. లక్నో సారథి కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52;  6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. దాంతో లక్నో భారీ టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచగలిగింది. చివర్లో మార్కస్ స్టొయినస్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో లక్నో జట్టు 200 మార్కుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.

196 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్ మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడినా ఢిల్లీకి గెలుపును మాత్రం అందించలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా లీగ్ లో లక్నో 6వ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది 5వ ఓటమి కావడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Delhi Capitals, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Prithvi shaw, Rishabh Pant, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు