హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli - MS Dhoni : ' లెజెండ్ ధోనికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా .. మహీ అంటే నీకు కుళ్లు ' .. కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్..

Virat Kohli - MS Dhoni : ' లెజెండ్ ధోనికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా .. మహీ అంటే నీకు కుళ్లు ' .. కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్..

MS Dhoni - Virat Kohli

MS Dhoni - Virat Kohli

Virat Kohli - MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కూడా వరుస వైఫల్యాలతో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాడు. అయితే, ఇదే సమయంలో తన ప్రవర్తనతో అభిమానుల్ని మరింత నిరాశపరుస్తున్నాడు కింగ్ కోహ్లీ.

ఇంకా చదవండి ...

  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2022)లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌ను 13పరుగుల తేడాతో ఓడించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌ల ఓటములకు బ్రేక్ పడింది. ఆర్సీబీ కీలక టైంలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్ విజయంతో ఆ జట్టు ఓటముల పరంపరను అధిగమించడమే కాకుండా 11మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 12పాయింట్లతో లీగ్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకుంది ఆర్సీబీ. అయితే, ఈ మ్యాచులో ధోని (MS Dhoni) పట్ల కోహ్లీ (Virat Kohli) ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

  అసలకే వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తోన్న కోహ్లీని ఇలా చూసి ఫ్యాన్స్ ఇంకా బాధపడుతున్నారు. మ్యాచులో భాగంగా చెన్నై కెప్టెన్ ధోని ఔట్ అయ్యాక.. కోహ్లీ అసభ్యకరమైన పదజాలంతో చేసుకున్న ఓవర్ సెలెబ్రేషన్స్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది. ఎంఎస్ ధోనీ లాంటి లెజెండ్ ఔటయ్యాక వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదని అభిమానులు నెట్టింటా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కోహ్లీ ప్రవర్తన ఏం బాలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు.

  వివరాల్లోకెళితే.. చెన్నై 174పరుగుల టార్గెట్ ఛేదిస్తున్న క్రమంలో 19ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్ ఓవర్‌లో ధోనీ మిడ్-వికెట్ దిశగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో బంతి నేరుగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్‌ చేతిలోకి వెళ్లింది. దీంతో ధోనీ ఔటయ్యాడు. కీలక దశలో ధోనీ ఔటవ్వడంతో మ్యాచ్ చెన్నై నుంచి చేజారి ఆర్సీబీ చేతిలోకి వెళ్లింది. ఇక ఈ ఔట్ సందర్భంగా.. విరాట్ కోహ్లీ గట్టిగట్టిగా అరుస్తూ.. అసభ్యకర భాషతో సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. దీంతో.. ఫ్యాన్స్ కోహ్లీ ప్రవర్తన మండిపడుతున్నారు.

  కోహ్లీ ప్రవర్తనపై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ ఓ పాములాంటోడని.. ధోని ఔటైతే ఇంత దారుణంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ధోని అంటే కోహ్లీకి కుళ్లు అంటూ వ్యాఖ్యానించాడు.భారత ఆర్మీకి చెందిన ఓ ప్లేయర్‌ను కోహ్లీ దుర్భాషలాడాడు. నిజం చెప్పాలంటే కోహ్లీ ఓ యాంటీ నేషనల్ పర్సన్ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

  మహేంద్ర సింగ్ ధోనీకి, విరాట్ కోహ్లీకి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పాడు మరో నెటిజన్. కోహ్లీ అవుట్ అయినప్పుడు ధోనీ రియాక్షన్ కూల్ గానే ఉంటుంది. కానీ ధోనీ అవుట్ అయితే మాత్రం కోహ్లీ ఎక్కడ లేని సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. కోహ్లీ ప్రవర్తన బాగాలేదంటూ కామెంట్ చేశాడు. అయితే.. ఈ కామెంట్లను కోహ్లీ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ధోని, రోహిత్, సచిన్ ఇలా ఎవరైనా సరే ఔటైనా కోహ్లీ ప్రవర్తన ఒకేలా ఉంటుందని.. అతని దూకుడు గురించి అందరికీ తెలుసని వెనుకేసుకు వస్తున్నారు. మ్యాచ్ గెలవాలన్న కసి కోహ్లీకి ఉంటుందని.. అందుకే ఇలా దూకుడుగా ఉంటాడని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Royal Challengers Bangalore, Viral Video, Virat kohli

  ఉత్తమ కథలు