Home /News /sports /

IPL 2022 ELIMINATOR LSG VS RCB LIVE SCORE UPDATES TOSS IS DELAY DUE TO SLIGHT DRIZZLE AND HERE THE RULES SRD

IPL 2022 - Eliminator : కీ ఫైట్ కు వరుణుడు అడ్డంకి.. టాస్ ఆలస్యం.. నిబంధనలు ఇవే..

IPL 2022 - Eliminator

IPL 2022 - Eliminator

IPL 2022 - Eliminator : ప్రస్తుత సీజన్‌లో లక్నో, బెంగళూరు ఒకే ఒక సారి తలపడ్డాయి. అందులోనూ బెంగళూరుదే పై చేయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు విజయం సాధించింది.

    ఐపీఎల్ 2022 సీజన్‌ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లోలో రాజస్థాన్‌పై గుజరాత్‌ (Gujarat Titans) గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓడిన రాజస్థాన్‌ (Rajasthan Royals)కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్‌ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB)ల మధ్య హై ఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ పోరుకి వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ సమయానికి గ్రౌండ్ లో భారీ గాలులతో పాటు చిన్న పాటి వర్షం కురుస్తోంది. దీంతో, టాస్ ఆలస్యంగా పడనుంది.

    ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం వల్ల ఒక్క ఓవర్ కూడా సాధ్యం కాకపోతే.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో క్వాలిఫయర్ -2 లో అడుగుపెడుతోంది. ఇక, ఆర్సీబీ లగేజీ సర్దుకోవడమే. క్వాలిఫయర్ మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించలేదు. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో వర్షం కురిసి నిర్ణీత సమయానికి మ్యాచ్ ఆడడం సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్‌లో విజేతను నిర్ణయిస్తారు. అదే 6 బంతుల్లోనే ఫలితం నిర్ణయించబడుతుంది.

    వర్షం ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ సమయానికి సంబంధించి కూడా కొత్త నిబంధనలను రూపొందించారు. మ్యాచ్‌ని పూర్తి చేయడానికి 200 నిమిషాల పాటు అదనంగా 2 గంటలు కేటాయించారు. వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్ ఆలస్యం అయితే రాత్రి 9.40 గంటల వరకు మ్యాచ్ ప్రారంభం కావచ్చు.

    ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్ మారింది. మే 29న మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా లీగ్ దశ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అదనంగా 2 గంటలు ఇస్తే ఓవర్లు ఏ మాత్రం కుదించబడవు. అంటే క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు రాత్రి 9.40 గంటలకు, ఫైనల్‌ రాత్రి 10.10 గంటలకు ప్రారంభమైనా పూర్తి 40 ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సేపు వర్షాలు కురిస్తే అప్పుడు ఓవర్లు కుదించాలని నిర్ణయించారు.

    అవసరమైతే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓవర్ల సంఖ్యను కూడా తగ్గించి, ప్రతి జట్టుకు కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ 5-5 ఓవర్లలో మ్యాచ్ ప్రారంభానికి కటాఫ్ సమయం 11.56. 10 నిమిషాల విరామం మరియు 12.50 గంటలకు మ్యాచ్ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్ 5-5 ఓవర్లు అయితే.. మ్యాచ్ ప్రారంభం కావడానికి గరిష్ట సమయం అర్థరాత్రి 12.26 నిమిషాలు.

    తుది జట్ల అంచనా :

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్/ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

    లక్నో సూపర్ జెయింట్స్‌: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Faf duplessis, Glenn Maxwell, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు