Home /News /sports /

IPL 2022 ELIMINATOR LSG VS RCB LIVE SCORE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON BY 14 RUNS SRD

IPL 2022 - Eliminator : ఆర్సీబీ ముందుకు.. లక్నో ఇంటికి.. రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ వృధా..

Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

IPL 2022 - Eliminator : ఐపీఎల్ 2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి విజయాన్ని ఆర్సీబీని వరించింది. దీంతో... కేఎల్ రాహుల్ సేన లగేజీ సర్దుకోవాల్సి వచ్చింది.

    ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచులో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో లక్నోపై ఆర్సీబీ 14 పరుగుల తేడాతో గెలిచింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 79 పరుగులు ; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం వృధా అయింది. దీపక్ హుడా (26 బంతుల్లో 45 పరుగులు; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లతో మరోసారి కీలక సమయంలో రాణించాడు. హర్షల్, సిరాజ్, హసరంగ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఈ ఓటమితో లక్నో కథ ముగిసింది. ఆర్సీబీ క్వాలిఫయర్ కు ఎంపికైంది. ఈ నెల 28న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో అమీతుమీ తేల్చుకోనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న డికాక్ ఆరు పరుగులు చేసి సిరాజ్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో.. 8 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.

    ఆ తర్వాత మనన్ వోహ్రా కాసేపు క్లాసిక్ షాట్లతో అలరించాడు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న వోహ్రాని హాజెల్ వుడ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో.. 41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత దీపక్ హుడా, కేఎల్ రాహుల్ కలిసి లక్నో ఇన్నింగ్స్ ని సరిదిద్దారు. ఈ ఇద్దరి ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఓ సారి క్రీజులో కుదురుకున్నాక ఈ జోడి విధ్వంసం సృష్టించింది. ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించారు. ఈ క్రమంలో మూడో వికెట్ కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హసరంగ విడదీశాడు.

    26 బంతుల్లో 45 పరుగులు చేసిన దీపక్ హుడాని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో.. 137 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా ఔటైనా.. లక్నో తమ జోరును ఆపలేదు. కెప్టెన్ రాహుల్ కళాత్మక విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే.. రాహుల్ కి తోడుగా నిలవాల్సిన స్టొయినిస్ (9) పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 173 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది లక్నో. ఇక, ఆఖరి రెండు ఓవర్లలో 33 పరుగులు అవసరమవ్వగా.. జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్ల తీసి కేవలం తొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో.. ఆఖరి ఓవర్ లో 24 పరుగులు అవసరమయ్యాయ్. ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో..14 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది.

    అంతకుముందు రజత్ పాటిదార్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ ( 54 బంతుల్లో 112 పరుగులు ; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో దినేష్ కార్తీక్ (23 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, ఆవేశ్ ఖాన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Faf duplessis, Glenn Maxwell, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు