హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - Eliminator : 54 బంతుల్లో 112 పరుగులు.. పాటిదార్ షాన్ దార్ సెంచరీ.. లక్నో ముందు భారీ టార్గెట్..

IPL 2022 - Eliminator : 54 బంతుల్లో 112 పరుగులు.. పాటిదార్ షాన్ దార్ సెంచరీ.. లక్నో ముందు భారీ టార్గెట్..

Rajat Patidar (IPL Twitter)

Rajat Patidar (IPL Twitter)

IPL 2022 - Eliminator : వాటే ఇన్నింగ్స్.. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సీబీ యంగ్ కుర్రాడు రజత్ పాటిదార్. అతని సూపర్ సెంచరీకి ఆఖర్లో కార్తీక్ మెరుపులు తోడవ్వడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ ( 54 బంతుల్లో 112 పరుగులు ; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో దినేష్ కార్తీక్ (23 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, ఆవేశ్ ఖాన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఎలిమినేటర్ మ్యాచులో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్‌ పాఫ్‌ డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత కోహ్లీతో కలిసిన రజత్ పాటిదార్ తన స్టామినా ఏంటో చూపించాడు. గాడితప్పిన ఆర్సీబీ ఇన్నింగ్స్ కు తన హిట్టింగ్ తో ప్రాణం పోశాడు ఈ కుర్రాడు. మరో ఎండ్ లో కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడితే.. ఈ కుర్రాడు మాత్రం అవలీలగా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఆవేశ్ ఖాన్ విడదీశాడు. 25 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మోసిన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో.. 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఓ వైపు మిగతా బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికే నానా తంటాలు పడితే.. పాటిదార్ సూపర్ ఫిఫ్టితో మెరిశాడు. అయితే, ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 9 పరుగులు చేసిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఎవిన్‌ లూయిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మహీపాల్ లోమ్రర్ (14) పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడ్డా.. మరో ఎండ్ లో తగ్గేదే లే అన్నట్టు సాగింది రజత్ పాటిదార్ బ్యాటింగ్.

ఇక, రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్ లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు ఈ యంగ్ గన్. ఇక.. పాటిదార్ కి ఆఖర్లో దినేష్ కార్తీక్ కూడా తోడయ్యాడు. కార్తీక్ కూడా మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు రజత్ పాటిదార్. ప్లే ఆఫ్స్ లో తడబడకుండా సెంచరీ చేయడం మాములు విషయం కాదు. ఈ ఇద్దరి ధాటికి ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.

తుది జట్లు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్‌: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మనన్ వోహ్రా, మార్కస్ స్టొయినిస్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్

First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు