Home /News /sports /

IPL 2022 ELIMINATOR LSG VS RCB LIVE SCORE UPDATES PREVIEW HEAD TO HEAD TO HEAD RECORDS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD

IPL 2022 - Eliminator : గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి.. కీ ఫైట్ లో తుది జట్లు ఇవే..!

IPL 2022 - Eliminator

IPL 2022 - Eliminator

IPL 2022 - Eliminator : ప్రస్తుత సీజన్‌లో లక్నో, బెంగళూరు ఒకే ఒక సారి తలపడ్డాయి. అందులోనూ బెంగళూరుదే పై చేయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు విజయం సాధించింది.

  ఐపీఎల్ 2022 సీజన్‌ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లోలో రాజస్థాన్‌పై గుజరాత్‌ (Gujarat Titans) గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓడిన రాజస్థాన్‌ (Rajasthan Royals)కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్‌ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB)ల మధ్య హై ఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. తమ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ ఒకటి.. కాస్త అదృష్టం కలిసొచ్చి ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి మరీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్టేమో మరొకటి.

  ప్రస్తుత సీజన్‌లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. లీగ్‌ దశలో 14 మ్యాచులకుగాను 9 విజయాలు సాధించి ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, డికాక్, దీపక్‌ హుడా, స్టొయినిస్‌, కృనాల్ పాండ్య, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని వంటి బ్యాటింగ్‌ దళంతో లక్నో అద్భుత విజయాల్ని సాధించింది. అయితే ఛేజింగ్‌లో టాప్‌ఆర్డర్‌ చేతులెత్తేయడంతో మిడిల్, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీంతో నాలుగు మ్యాచ్‌లను ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టొయినిస్, హోల్డర్‌, దీపక్‌, బదోని రాణిస్తున్నా ఓటమి తప్పలేదు. కాబట్టి నాకౌట్‌ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన ఇంటి ముఖం పట్టక తప్పదు.

  బౌలింగ్‌ విభాగానికి వస్తే చమీర, అవేశ్‌ ఖాన్‌, మోహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్‌, హోల్డర్‌, స్టొయినిస్‌ కలిసి కట్టుగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. వీరిలో అవేశ్‌ ఖాన్ (17) ఒక్కడే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా టాప్‌-10లో చోటు సంపాదించాడు. జాసన్ హోల్డర్ (14), మోహ్‌సిన్ ఖాన్‌ (8 మ్యాచుల్లోనే 13 వికెట్లు), రవి బిష్ణోయ్ (12), కృనాల్ పాండ్య (9), చమీర (9) రాణించారు. లక్నోలో దీపక్‌ హుడా, జాసన్‌ హోల్డర్, స్టొయినిస్‌, కృనాల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం.

  ఈసాలా కప్‌ నమదే.. నినాదంతో ఆర్సీబీ ప్రతి సీజన్‌కు రావడం.. ఆ తర్వాత బొక్కబొర్లాపడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్‌లోనూ లీగ్‌ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి ఢిల్లీపై ముంబై విజయంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. జట్టు పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. కానీ మైదానంలో తేలిపోతుండటమే అసలు సమస్య. మరి అదృష్టం కలిసొచ్చి నాకౌట్‌కు చేరుకున్న బెంగళూరు తమ కప్పు కల నెరవేర్చుకోవాలంటే కష్టపడాల్సిందే.

  ఈ సీజన్ ఆరంభంలో కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అదరగొట్టాడు. తర్వాత నుంచి తన స్థాయి ఆటను ఆడలేకపోయాడు. ఇక మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఒకటి అరా మ్యాచుల్లో తప్ప పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే బ్యాటింగ్‌లో మిడిల్‌, లోయర్‌ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ దినేశ్‌ కార్తిక్‌ రెచ్చిపోయాడు. 14మ్యాచుల్లో 191.33 స్ట్రైక్‌రేట్‌తో 287 పరుగులు సాధించాడు. అయితే కార్తిక్‌ మాత్రమే కాకుండా మిగతా బ్యాటర్లూ లక్నోతో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాణించాల్సిందే.

  లేకపోతే గెలవడం అంత సులువేం కాదు. బౌలింగ్‌లో బెంగళూరు పరిస్థితి ఫర్వాలేదు. వాహిందు హసరంగ (24) మోస్ట్‌ వికెట్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హర్షల్‌ పటేల్ (18), జోష్ హేజిల్‌వుడ్ (15) కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మద్‌ సిరాజ్ (8) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. షాబాజ్ నదీమ్ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా పోషించాలి.

  తుది జట్ల అంచనా :

  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్/ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

  లక్నో సూపర్ జెయింట్స్‌: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Faf duplessis, Glenn Maxwell, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు