హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 Playoffs : 6 బంతుల్లోనే ఫలితం.. 5-5 ఓవర్ల మ్యాచ్.. ప్లే ఆఫ్స్ కొత్త నిబంధనలు ఇవే..

IPL 2022 Playoffs : 6 బంతుల్లోనే ఫలితం.. 5-5 ఓవర్ల మ్యాచ్.. ప్లే ఆఫ్స్ కొత్త నిబంధనలు ఇవే..

IPL 2022

IPL 2022

IPL 2022 Playoffs : మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫైయర్ జట్టు ఫైనల్‌ మ్యాచ్ ఆడనుంది.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌ విజయవంతంగా లీగ్‌ దశను పూర్తిచేసుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్‌ రాయల్స్ (GT vs RR) మంగళవారం తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB)) బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. ఈ మ్యాచులకు ముందు బీసీసీఐ ఫ్లే ఆఫ్స్, ఫైనల్ కు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రకటిచింది. ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో వర్షం కురిసి నిర్ణీత సమయానికి మ్యాచ్ ఆడడం సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్‌లో విజేతను నిర్ణయిస్తారు. అదే 6 బంతుల్లోనే ఫలితం నిర్ణయించబడుతుంది.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం వల్ల ఒక్క ఓవర్ కూడా సాధ్యం కాకపోతే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అంటే గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే.. గుజరాత్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ చేరుతుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ మొదటి స్థానంలో, రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక, ఇదే రూల్ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా వర్తించనుంది. లక్నో మరియు RCB మ్యాచ్ కూడా వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోతే.. లక్నో ఫైనల్ లో అడుగుపెడుతోంది. ఇక, ఆర్సీబీ లగేజీ సర్దుకోవడమే. క్వాలిఫయర్ మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించలేదు.

ప్లే ఆఫ్స్ లో వర్షం

IPL 2022 మొదటి క్వాలిఫైయర్ మరియు ఎలిమినేటర్ మ్యాచ్ మంగళవారం మరియు బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు, తుపానులతో కోల్‌కతా అతలాకుతలమైంది. స్టేడియం ప్రెస్ బాక్స్ కూడా ధ్వంసం అయింది. రానున్న కొద్ది రోజుల పాటు ఇక్కడ వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా. వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి : IPL 2022 Qualifier 1: తొలి క్వాలిఫయర్‌ జరగడం డౌటే.. మ్యాచ్ రద్దు అయితే ఫైనల్‌కి ఎవరు వెళ్తారు?

వర్షం ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ సమయానికి సంబంధించి కూడా కొత్త నిబంధనలను రూపొందించారు. మ్యాచ్‌ని పూర్తి చేయడానికి 200 నిమిషాల పాటు అదనంగా 2 గంటలు కేటాయించారు. వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్ ఆలస్యం అయితే రాత్రి 9.40 గంటల వరకు మ్యాచ్ ప్రారంభం కావచ్చు.

ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్ మారింది. మే 29న మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా లీగ్ దశ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అదనంగా 2 గంటలు ఇస్తే ఓవర్లు ఏ మాత్రం కుదించబడవు. అంటే క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు రాత్రి 9.40 గంటలకు, ఫైనల్‌ రాత్రి 10.10 గంటలకు ప్రారంభమైనా పూర్తి 40 ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సేపు వర్షాలు కురిస్తే అప్పుడు ఓవర్లు కుదించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి : ’ఆకలితో ఉన్న పులిలా ఉన్నా.. నాతో జాగ్రత్తా‘ గుజరాత్ టైటాన్స్ ను హెచ్చరించిన రాజస్తాన్ స్టార్ బ్యాటర్

ఫైనల్ కు రిజర్వ్ డే..

ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మే 29న జరగనుంది. మొదటి రోజు ఫైనల్‌ ప్రారంభమై.. వర్షం వల్ల ఆగిపోతే.. మరుసటి రోజు మ్యాచ్‌ ఆగిపోయిన చోట నుంచి ఆట ప్రారంభమవుతుంది. క్వాలిఫయర్ మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌ల తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తే డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిర్ణయించబడుతుంది.

5-5 ఓవర్ల మ్యాచ్

అవసరమైతే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓవర్ల సంఖ్యను కూడా తగ్గించి, ప్రతి జట్టుకు కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ 5-5 ఓవర్లలో మ్యాచ్ ప్రారంభానికి కటాఫ్ సమయం 11.56. 10 నిమిషాల విరామం మరియు 12.50 గంటలకు మ్యాచ్ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్ 5-5 ఓవర్లు అయితే.. మ్యాచ్ ప్రారంభం కావడానికి గరిష్ట సమయం అర్థరాత్రి 12.26 నిమిషాలు.

First published:

Tags: Bcci, Gujarat Titans, IPL 2022, Kolkata, Lucknow Super Giants, Rajasthan Royals, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు