Home /News /sports /

IPL 2022 DUE TO POWER CUT PROBLEM CSK DENIED REVIEWS AND FANS TROLLED BCCI FOR THIS ISSUE SRD

IPL 2022 : ఒక్క ఘటన.. బీసీసీఐ పరువు మొత్తం పాయె.. ఇలా ఫైనల్ లో జరిగి ఉంటే..!

Rohit Sharma - MS Dhoni

Rohit Sharma - MS Dhoni

IPL 2022 : ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI) మధ్య జరిగిన ఘటన ఐపీఎల్, బీసీసీఐ దిగజారేలా చేసింది. దీనిపై ఫ్యాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు.

  ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. కామధేనువులా మారిన ఐపీఎల్.. బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే.. తాజాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI) మధ్య జరిగిన ఘటన ఐపీఎల్, బీసీసీఐ దిగజారేలా చేసింది. ప్రపంచ క్రికెట్ లో ఫేమస్ లీగ్ లో పవర్ కట్ సమస్య వల్ల ఫలితం తారుమారు అయింది. దీంతో.. అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. వివరాల్లోకెళితే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది.

  చివరకు పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి.అయితే పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు... టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది.

  దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.. రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి.


  అసలు పవర్ కట్ సమస్యగా మారడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలాంటి లీగ్‌లో పవర్ కట్ అవ్వడం సిగ్గు చేటని, కోట్ల డబ్బులున్న బీసీసీఐ ఈ విషయంలో సిగ్గుపడాలని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది.


  యావత్ ప్రపంచం ముందు భారత్ పరువు తీశారని బీసీసీఐపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలే కాదు బీసీసీఐ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌ను లైట్ తీసుకుందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇదే.. ఘటన ఫైనల్ లో జరిగి ఉంటే.. కప్పు అనవసరంగా చేతులు మారేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ సమస్య వల్ల చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. అదే.. ఫైనల్ లో జరిగితే.. ఏకంగా కప్పు అందుకునే టీమే మారిపోయి ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇలాంటి.. సమస్యలు మళ్లీ రిపీట్ కాకుంటే ఉంటే మంచిదని వారు బీసీసీఐకి సూచిస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bcci, Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Rohit sharma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు