విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఏమైంది. ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇదే ప్రశ్న.. 2015లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అని ఎలా డిస్కషన్స్ చేశారో.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు ఇలా ఆడుతున్నాడు? అంటూ క్రికెట్ లవర్స్ డిస్కషన్స్ చేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangalore) కెప్టెన్సీ నుంచి గతేడాది తప్పుకున్న అతడు.. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక, ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు కోహ్లీ. ఆడిన 10 మ్యాచుల్లో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇక, వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లీకి మాజీ క్రికెటర్లు సలహాలిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ కోహ్లీని కొన్ని నెలల పాటు ఆటకు గుడ్ బై చెప్పి.. విశ్రాంతి తీసుకోమని సలహాలిచ్చారు. అలాగే, సచిన్ టెండూల్కర్ ని కలిసి క్రికెట్ టిప్స్ తీసుకోమని మరికొందరు సలహాలిచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేరిపోయాడు. అయితే.. వార్నర్ బాబాయ్ ఇచ్చిన సలహా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
స్పోర్ట్స్ యారి కి వ్యవస్థాపకుడు సుశాంత్ మెహతా తో ఇంటర్వ్యూ సందర్భంగా వార్నర్.. కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో కోహ్లి ఫామ్ పై వస్తున్న విమర్శలపై మీ స్పందనేమిటి..? అతడికి మీరు ఏమైనా సూచనలిస్తారా..? అన్న ప్రశ్నకు వార్నర్ మాట్లాడుతూ.. ‘ఏమీ లేదు. మరో ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండి.. వారి ప్రేమను ఆస్వాదించండి..’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.
అంతేగాక వార్నర్ స్పందిస్తూ.. " ఫామ్ అనేది టెంపరరీ క్లాస్ ఎప్పటికీ శాశ్వతం. మనం దానిని కోల్పోకూడదు. ప్రపంచంలోని ఏ ఆటగాడికైనా తమ కెరీర్ లో ఇలాంటి ఒక దశ ఎదురవుతుంది. మీరు ఎంత గొప్ప ఆటగాడైనా కావొచ్చు.. ఈ దశను దాటాల్సిందే. ఈ ఎత్తు పల్లాలు చూడాల్సిందే. అయితే మీరు ఎక్కిన మెట్లను మళ్లీ రావడానికి మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కోహ్లి బేసిక్స్ కు కట్టుబడి ఉంటే చాలు. ఫామ్ అనేది పెద్ద విషయం కాదు.. " అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్-అనుష్కల కు గతేడాది వామిక పుట్టింది. ఇటీవలే వామిక మొదటి పుట్టినరోజును కూడా జరుపుకుంది. ఇక వార్నర్-కాండీస్ లకు ముగ్గురు ఆడపిల్లలే. పిల్లలంటే వార్నర్ కు చాలా ఇష్టం. తాను చేసే టిక్ టాక్ వీడియోలలో ఎక్కువ భాగం తన పిల్లలతోనే చేస్తుంటాడు వార్నర్. మ్యాచులు లేకుంటే వార్నర్ కు తన కూతుళ్లతోనే టైమ్ పాస్.
Take your phone & call BEN STOKES! 😂
Axar Patel on what David Warner should do if he woke up as Virat Kohli 🔥@bira91 #ViratKohli #SportsYaari pic.twitter.com/hozLFWi61h
— Sushant Mehta (@SushantNMehta) May 4, 2022
గతంలోలాగా టీమిండియాలో విరాట్ ఆడిందే ఆటగా సాగే రోజులు కావు ఇవి. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత నుంచి కూడా కోహ్లీకి బీసీసీఐకి మధ్య పొసగడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట కోహ్లీ టి20ల నుంచి మాత్రమే తప్పుకోగా.. ఆ తర్వాత బీసీసీఐ అతడిని వన్డేల నుంచి తప్పించింది. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్ లో టెస్టు సిరీస్ లో తీవ్రంగా విఫలమైన తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడు కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు.
అంతేకాకుండా టీమిండియాలో చోటు కోసం చాలా మంది యువ ప్లేయర్స్ వేచి చూస్తూ ఉన్నారు. ఈ ఐపీఎల్ నే చూసుకుంటే తిలక్ వర్మ, ఆయుశ్ బదోని లాంటి ప్లేయర్స్ సత్తా చాటారు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. మునపటిలా భారీ షాట్లు ఆడకపోయినా.. మిడిలార్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు.
అంతేకాకుండా మూడో స్థానం నా డ్రీమ్ అంటూ కామెంట్స్ కూడా చేశాడు. అంటే కోహ్లీ స్థానం కోసం హార్దిక్ పాండ్యా రేసులో ఉన్నట్లే లెక్క. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ లో పెద్దగా రాణించడం లేదు. కానీ అతడు కెప్టెన్ కాబట్టి అతడిపై వేటు పడే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది. లేదంటే.. కోహ్లీపై వేటు తప్పకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Cricket, David Warner, Delhi Capitals, IPL 2022, Royal Challengers Bangalore, Virat kohli