హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : హాస్పిటల్ లో ఢిల్లీ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా.. కారణం అదేనా?

IPL 2022 : హాస్పిటల్ లో ఢిల్లీ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా.. కారణం అదేనా?

పృథ్వీ షా

పృథ్వీ షా

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు పరిస్థితి ఒక విజయం రెండు పరాజయాలు అన్న చందంగా సాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్ లో చతికిల పడింది.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు పరిస్థితి ఒక విజయం రెండు పరాజయాలు అన్న చందంగా సాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్ లో చతికిల పడింది. దాంతో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు డేంజర్ లో పడ్డాయి. ఆ జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్ ల్లోనూ భారీ తేడాతో విజయం  సాధించాల్సి ఉంది. అయితే ఆ జట్టు సభ్యులను అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు కరోనాతో ఇబ్బంది పడ్డ ఆ జట్టు.. తాజాగా స్టార్ ఓపెనర్ అనారోగ్య సమస్యతో సతమతమవుతోంది

ఇది కూడా చదవండి : ’దండాలయ్యా దండాలయ్యా‘.. డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ను కోహ్లీ ఎలా గౌరవించాడో చూడండి

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా కీలక బ్యాటర్. ఓపెనర్ గా వచ్చే అతడు ప్రత్యర్థులపై తొలి బంతిని నుంచి ఎదురుదాడికి దిగగలడు. అయితే పృథ్వీ షా ఆదివారం నాడు హై ఫీవర్ తో హాస్పిటల్ లో చేరాడు. జ్వరం కారణంగానే అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఆదివారం నాటికి పృథ్వీ షాకు ఫీవర్ ఎక్కువ అవ్వడంతో అతడిని వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఒక ఫోటో ద్వారా పృథ్వీ షా స్పష్టం చేశాడు.

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పృథ్వీ షా పేర్కొన్నాడు. త్వరలోనే జట్టుతో కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 91 పరుగులతో ఓడిన సంగతి తెలిసిందే. దాంతో లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 5 విజయాలు 6 ఓటములతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్లే ఆఫ్ప్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆర్సీబీ జట్టు తమ మిగిలిన మ్యాచ్ ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Delhi Capitals, IPL, IPL 2022, MS Dhoni, Prithvi shaw, Ravindra Jadeja, Rishabh Pant

ఉత్తమ కథలు