Home /News /sports /

IPL 2022 DELHI CAPITALS OPENER DAVID WARNER RIGHT HAND SHOT ON BHUVNESHWAR KUMAR BOWLING VIDEO VIRAL ON SOCIAL MEDIA SJN

IPL 2022 : నువ్వు భువీ అయితే నాకేంటీ.. నేను వార్నర్.. డేవిడ్ వార్నర్! క్షణంలో ప్లాన్ ఎలా మార్చాడో మీరే చూడండి..

వార్నర్ వర్సెస్ భువీ (PC : TWITTER)

వార్నర్ వర్సెస్ భువీ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తన మాజీ టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై ప్రతీకార ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తన మాజీ టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై ప్రతీకార ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకు కసిగా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. వార్నర్ కు తోడు రోవ్ మన్ పావెల్ (35 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా అదరగొట్టడంతో సన్ రైజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరును సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్ మధ్య పోరు అద్భుతంగా సాగింది.

ఇది కూడా చదవండి : ఆల్రెడీ 157 ఏసేసావ్.. ఇంకో నాలుగు ఏస్తే ప్రపంచ రికార్డే.. కమాన్ ఉమ్రాన్..

18వ ఓవర్ వేయడానికి డేవిడ్ వార్నర్ బౌలింగ్ కు రాగా.. తొలి బంతిని వేయడానికి సిద్ధమయ్యాడు. అయితే వార్నర్ ఆ బంతిని స్విచ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ప్లాన్ మార్చిన భువనేశ్వర్.. వార్నర్ స్విచ్ షాట్ ఆడకుండా లెగ్ సైడ్ యార్కర్ వేశాడు. అయితే భువనేశ్వర్ ప్లాన్ ను పసిగట్టిన వార్నర్.. క్షణాల్లో తన ప్లాన్ ను మార్చిన వార్నర్ రైట్ హ్యాండర్ ఆడినట్లు తన బ్యాట్ ఫేస్ ను కొద్దిగా తెరిచి షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.



ఇది కూడా చదవండి : నాడు అవమానం.. నేడు ప్రతీకారం.. కానీ, నువ్వేప్పటికీ మా డేవిడ్ భాయ్ వే..

ఇక్కడ భువనేశ్వర్, వార్నర్ ఇద్దరూ కూడా ఒకరి మైండ్ ను ఒకరు ముందే చదివారు. కానీ, వార్నర్ మాత్రం భువనేశ్వర్ మైండ్ ను రెండు సార్లు చదివి అద్భుత షాట్ తో బౌండరీ రాబట్టాడు. ఇక మ్యాచ్ లో వార్నర్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని దూరం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వార్నర్ తో పాటు రోవెమన్ పావెల్ ( 35 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హైదరాబాద్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.  208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమై ఓడింది. నికోలస్ పూరన్ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), మార్కరమ్ (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: David Warner, Delhi Capitals, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Jasprit Bumrah, Kane Williamson, Kieron pollard, Mumbai Indians, Rashid Khan, Rohit sharma, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు