హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - DC vs RR : హై డ్రామా పోరులో రాజస్థాన్ విక్టరీ.. ఈ విజయంతో టాప్ ప్లేసుకి రాయల్స్..

IPL 2022 - DC vs RR : హై డ్రామా పోరులో రాజస్థాన్ విక్టరీ.. ఈ విజయంతో టాప్ ప్లేసుకి రాయల్స్..

Rajasthan Royals (IPL twitter)

Rajasthan Royals (IPL twitter)

IPL 2022 - DC vs RR : ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హై డ్రామా నడిచిన పోరులో చివరికి రాజస్థాన్ నే విజయం కైవసం చేసుకుంది.

హోరాహోరీగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ తన రాజసం చూపించింది. వాంఖడేలో జరిగిన మ్యాచులో ఢిల్లీని మట్టికరిపించి ఈ సీజన్ లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 223 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీంతో, 15 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. రిషబ్ పంత్ (24 బంతుల్లో 44 పరుగులు ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), లలిత్ యాదవ్ (24 బంతుల్లో 37 పరుగులు ; 3ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (27 బంతుల్లో 37 పరుగులు; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఆఖర్లో రొవెమన్ పావెల్ (15 బంతుల్లో 36 పరుగులు.. 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. అయితే, ఆఖరి ఓవర్ లో 36 పరుగులు చేయాల్సిన సమయంలో మెక్ కే వేసిన ఓవర్ లో ఫస్ట్ మూడు బంతులు మూడు సిక్సర్లు బాది హీట్ పెంచాడు. ఇక, ఆఖరి ఓవర్ లో హై డ్రామా నడిచింది. మూడో బంతిని హై నో బాల్ ప్రకటించలేదని.. బ్యాటర్లను వచ్చేయని రిషబ్ పంత్ అనడంతో హీట్ పెరిగింది. కానీ, అంపైర్లు సర్ది చెప్పడంతో మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ప్రసిద్ద్ 19 వ ఓవర్ మెయిడిన్ వేయడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇక, ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేసుకి జరిగింది.

223 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు మరోసారి మంచి ఆరంభం అందించే ప్రయత్నం చేశారు ఆ జట్టు ఓపెనర్లు వార్నర్, పృథ్వీషా. దీంతో, నాలుగు ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 35 ప‌రుగులు చేసింది. అయితే, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో ఊపుమీదున్న వార్నర్ ఈ మ్యాచులో 28 పరుగులకే పరిమితమయ్యాడు. 28 ప‌రుగులు చేసిన వార్న‌ర్‌.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శాంస‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో, 43 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ. ఆ వెంటనే 48 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఆ తర్వాత పృథ్వీ షా, కెప్టెన్ పంత్ కాసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. 37 ప‌రుగులు చేసిన పృథ్వీ షా.. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ తర్వాత కూడా పంత్ తన దూకుడు తగ్గించలేదు. వరుస బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. అయితే, దూకుడు మీదున్న పంత్ జోరుకు కళ్లెం వేశాడు ప్రసిద్ధ్. 44 పరుగులు చేసిన పంత్.. పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ (1) కూడా నిరాశపర్చాడు. చాహల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అక్షర్. 10 పరుగులు చేసిన శార్దూల్ రనౌట్ అయ్యాడు. దీంతో, 157 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ.

ఆఖర్లో లలిత్ యాదవ్, రొవెమన్ పావెల్ బౌండరీలతో అలరించారు. ఇక, 37 పరుగులు చేసిన లలిత్ యాదవ్ ప్రసిద్ద్ బౌలింగ్ లో సంజూ శామ్సన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 19వ ఓవర్ ని ప్రసిద్ద్ మెయిడిన్ వేయడం విశేషం. అయితే, ఆఖరి ఓవర్ లో 36 పరుగులు చేయాల్సిన సమయంలో మెక్ కే వేసిన ఓవర్ లో ఫస్ట్ మూడు బంతులు మూడు సిక్సర్లు బాది హీట్ పెంచాడు. ఇక, ఆఖరి ఓవర్ లో హై డ్రామా నడిచింది. మూడో బంతి హై నో బాల్ ప్రకటించలేదని.. బ్యాటర్లను వచ్చేయని రిషబ్ పంత్ అనడంతో హీట్ పెరిగింది.

అంతకుముందు.. వాంఖడే మైదానంలో పరుగుల వరద పారింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపారు. జాస్ బట్లర్ మాస్ విధ్వంసంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్ లో ఇదే భారీ స్కోరు. జాస్ బట్లర్ (65 బంతుల్లో 115 పరుగులు ; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) మరోసారి సూపర్ సెంచరీతో చెలరేగాడు. జాస్ బట్లర్ కి ఈ సీజన్ లో మూడో సెంచరీ. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 54 పరుగులు; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ ( 20 బంతుల్లో 46 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించారు. దీంతో, ఢిల్లీ ముందు భారీ టోటల్ సెట్ చేసింది రాజస్థాన్.

First published:

Tags: Cricket, David Warner, Delhi Capitals, IPL 2022, Prithvi shaw, Rajasthan Royals, Rishabh Pant, Sanju Samson

ఉత్తమ కథలు