Home /News /sports /

IPL 2022 DC VS RR FUNNY FIGHT BETWEEN KULDEEP YADAV AND YUZVENDRA CHAHAL DURING DC VS RR MATCH VIDEO GOES VIRAL SJN

IPL 2022: ’నీకెందుకురా.. మూస్కోని అటు పో‘ కుల్దీప్ పై చహల్ కోపం.. వైరల్ అవుతోన్న వీడియో

కుల్దీప్ యాదవ్, చహల్  (PC: TWITTER)

కుల్దీప్ యాదవ్, చహల్ (PC: TWITTER)

IPL 2022: చప్పగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) శుక్రవారం జరిగిన మ్యాచ్ తో హాట్ హాట్ గా మారిపోయింది. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ కు కావల్సినంత పబ్లిసిటీని తెచ్చేసింది.

ఇంకా చదవండి ...
IPL 2022: చప్పగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) శుక్రవారం జరిగిన మ్యాచ్ తో హాట్ హాట్ గా మారిపోయింది. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ కు కావల్సినంత పబ్లిసిటీని తెచ్చేసింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19వ ఓవర్ తర్వాత 7 వికెట్లకు 187 పరుగులతో నిలిచింది. ఢిల్లీ జట్టు విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్ లో 36 పరుగులు చేయాలి. బౌలింగ్ కు మెకాయ్ రాగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో భీకర హిట్టర్ రోవ్ మన్ పావెల్ ఉన్నాడు. తొలి మూడు బంతులను కూడా భారీ సిక్సర్లు బాదాడు. అయితే మూడో బంతి హై ఫుల్ టాస్ కావడం.. అది బ్యాటర్ నడుము కంటే కూడా ఎత్తులో రావడంతో బ్యాటింగ్ జట్టు నో బాల్ అంటూ అంపైర్లకు అప్పీల్ చేసింది.

అంపైర్లు దీనికి ఒప్పుకోక పోవడంతో డగౌట్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్లేయర్స్ ను డగౌట్ కు వచ్చేయాలంటూ సైగలు చేశాడు. ఇక అదే సమయంలో మైదనాంలో ఉన్న కుల్దీప్ యాదవ్. లెగ్ అంపైర్ తో గొడవకు దిగాడు. నో బాల్ గా ఎలా ప్రకటించవంటూ వాదనకు దిగాడు. అయితే అక్కడే ఉన్న రాజస్తాన్ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కుల్దీప్ దగ్గరకు వచ్చి. ’నీకెందుకు రా.. మూస్కొని అటు పో‘ అన్నట్లు అతడిని పక్కకు నెట్టుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక్కడ కుల్దీప్ తో చహల్ వ్యవహరించిన తీరు నవ్వు తెప్పించేలా ఉంది.



కుల్చా ద్వయంగా చహల్, కుల్దీప్ లకు పేరు. వీరిద్దరూ గతంలో టీమిండియాకు అద్భుత విజయాలను అందించారు. అయితే 2019 అనంతరం కుల్దీప్ ఫామ్ లో లేక జట్టు నుంచి వేటుకు గురయ్యాడు. అదే సమయంలో మిస్టరీ స్పిన్నర్ల మోజులో చహల్ ను గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ కు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిద్దరు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. చహల్ హ్యాట్రిక్ తో మెరిస్తే.. కేకేఆర్ మ్యాచ్ లో కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. చహల్ 18 వికెట్లతో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉండగా.. కుల్దీప్ 13 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, IPL, IPL 2022, Rajasthan Royals, Rishabh Pant, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు