Home /News /sports /

IPL 2022 DC VS RCB LIVE SCORE UPDATES ROYAL CHALLENGERS BANGALORE SETS FIGHTING TOTAL ON SCORE BOARD WITH DINESH KARTHIK BRILLIANT KNOCK SRD

IPL 2022 - DC vs RCB : దినేష్ కార్తీక్, కొత్త అల్లుడు దుమ్మురేపారు.. ఢిల్లీ ముందు బిగ్ టోటల్..

Dinesh Karthik (IPL twitter)

Dinesh Karthik (IPL twitter)

IPL 2022 - DC vs RCB : మరోసారి దినేష్ కార్తీక్ తన స్టామినా ఏంటో చూపించాడు. కష్టాల్లో పడ్డ ఆర్సీబీని ఆదుకున్నాడు. సూపర్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీకి మంచి స్కోరు అందించాడు.

    వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. దినేశ్ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ ( 34 బంతుల్లో 66 పరుగులు ; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ( 34 బంతుల్లో 55 పరుగులు ; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) , షాబాజ్ నదీమ్ ( 21 బంతుల్లో 32 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే షాకులు మీద షాకులు తగిలాయ్. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అనూజ్‌ రావత్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో, ఐదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. 8 పరుగులు చేసిన ఫాఫ్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

    దీంతో, 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రనౌట్ అవ్వడంతో ఆర్సీబీ కష్టాలు మరింత పెరిగాయ్. 12 పరుగులు చేసిన కోహ్లీ.. మ్యాక్సీతో సమన్వయ లోపంతో.. లలిత్ యాదవ్ బుల్లెట్ త్రోకి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అయితే, 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని మ్యాక్సీ ఆదుకున్నాడు. తన సూపర్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేస్కున్నాడు.

    మరోవైపు, ప్రభుదేశాయ్ 6 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత 55 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, దినేష్ కార్తీక్ మరోసారి ఆపద్భాందువుడిగా మారాడు. యంగ్ క్రికెటర్ షాబాజ్ అహ్మద్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఆఖరి ఓవర్లలో దినేశ్ కార్తీక్ తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌండరీల వరద పారించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో షాబాజ్, కార్తీక్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు ఏకంగా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.

    తుది జట్లు
    ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్ పంత్, రోవమన్ పొవెల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, హజెల్ వుడ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Delhi Capitals, Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL 2022, Rishabh Pant, Royal Challengers Bangalore, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు