PBKS vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికొద్ది సేపట్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా డూ ఆర్ డై లాంటిది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రెండు జట్లు కూడా ఇకపై ప్రతి మ్యాచ్ లోనూ నెగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో కీలకమైన టాస్ ను పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నెగ్గాడు. అయితే గత మ్యాచ్ లకు విరుద్ధంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం అతడు ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది.
ఇది కూడా చదవండి : నువ్వు తోపు సామీ.. క్యాచ్ విషయంలో బట్లర్ సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా..
ఇక ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులు చేసింది. చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ అహ్మద్ ను కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకుంది. జ్వరం కారణంగా పృథ్వీ షా జట్టుకు దూరం కావడంతో ఢిల్లీ జట్టును ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. గత మ్యాచ్ ల్లో అతడి స్థానంలో మన్ దీప్ సింగ్, కేఎస్ భరత్ లను పరీక్షించినా వారు విఫలం అయ్యారు. దాంతో ఓపెనింగ్ ను మరోసారి మార్చింది. గత మ్యాచ్ లో ఆర్సీబీపై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. శిఖర్ ధావన్, మయాంక్ కూడా పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవడం నల్లేరుమీద నడకే. ప్రస్తుతం ఇరు జట్లు కూడా 12 పాయింట్లతో ఉన్నాయి. నెట్ రన్ రేట్ విషయంలో ఢిల్లీ జట్టు ముందు వరుసలో ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కాకుండా మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. అదే సమయంలో ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు క్లిష్టం అవుతాయి.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ అహ్మద్, మార్ష్, రోవ్ మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, హర్ ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, IPL, IPL 2022, Punjab kings, Rishabh Pant, Shikhar Dhawan