హోమ్ /వార్తలు /క్రీడలు /

PBKS vs DC : లివింగ్ స్టోన్ అదుర్స్.. ఢిల్లీ బెదుర్స్.. డూ ఆర్ డై మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

PBKS vs DC : లివింగ్ స్టోన్ అదుర్స్.. ఢిల్లీ బెదుర్స్.. డూ ఆర్ డై మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

లివింగ్ స్టోన్ (Pc : IPL)

లివింగ్ స్టోన్ (Pc : IPL)

PBKS vs DC : డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు బ్యాటింగ్ లో తడబడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPl) 2022 సీజన్ ల ో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...

PBKS vs DC : డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు బ్యాటింగ్ లో తడబడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPl) 2022 సీజన్ ల ో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ డేవిడ్ వార్నర్ తో పాటు మొత్తంగా 3 వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు. అర్ష్ దీప్ సింగ్ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఢిల్లీ బ్యాటర్స్ లో మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దాంతో ఢిల్లీ జట్టు ఫైటింగ్ టోటల్ ను పంజాబ్ ముందు ఉంచగలిగింది.

ఇది కూడా చదవండి : ఏంది వార్నర్ భాయ్ ఇలా చేశావ్.. వెళ్లి మరీ తన్నించుకున్నట్లు ఉంది నీ వాలకం చూస్తే..

టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు దిగగా.. ఇన్నింగ్స్ తొలి బంతికే వార్నర్ అవుటయ్యాడు. అయితే ఓపెనర్ గా వచ్చిన సర్ఫరాజ్, మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఓవర్ కు 10 రన్ రేట్ తో స్కోరు బోర్డు ముందుకు సాగడంతో ఢిల్లీ 200 మార్కును ఈజీగా అందుకుంటుందని అనిపించింది. అయితే సర్ఫరాజ్ ఖాన్ ను అర్ష్ దీప్ సింగ్ పెవలియన్ కు చేర్చాడు. అనంతరం వచ్చిన లలిత్ యాదవ్  (24) మార్ష్ కు చక్కటి సహకారం అందించాడు. లలిత్ యాదవ్ ను కూడా అర్ష్ దీపే అవుట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పంత్ భారీ సిక్సర్ కొట్టి ఆ తర్వాత స్టంపౌట్ అయ్యాడు. అనంతరం రోవ్ మాన్ పావెల్ (2) కూడా లివింగ్ స్టోన్ కే వికెట్ సమర్పించుకున్నాడు.  దాంతో ఒక్కసారిగా ఢిల్లీ స్కోరు బోర్డు వేగం తగ్గింది. అయితే మరో ఎండ్ లో ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన మార్ష్.. తన ఐపీఎల్ కెరీర్ లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ రెండు కూడా ఈ సీజన్ లోనే రావడం విశేషం. చివర్లో ఢిల్లీ బ్యాటర్స్ భారీ షాట్లు ఆడలేకపోవడంతో 159 స్కోరు వద్ద ఆగిపోయింది.

తుది జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్

రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ అహ్మద్, మార్ష్, రోవ్ మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్

మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, హర్ ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష దీప్ సింగ్

First published:

Tags: David Warner, Delhi Capitals, IPL, IPL 2022, Prithvi shaw, Punjab kings, Rishabh Pant, Shikhar Dhawan

ఉత్తమ కథలు