IPL 2022 DC VS PBKS LIVE SCORE UPDATES PUNJAB KINGS SETS NORMAL TARGET ON SCORE BOARD AND DELHI BOWLERS SUPER SRD
IPL 2022 - DC vs PBKS : ఢిల్లీ బౌలర్లు జిగేల్.. పంజాబ్ బ్యాటర్లు హడల్.. పంత్ సేన టార్గెట్ ఎంతంటే..
Delhi Capitals (IPL Twitter)
IPL 2022 - DC vs PBKS : ఢిల్లీని కరోనా భయపడితే.. ఆ జట్టు బౌలర్లు పంజాబ్ ని వణికించారు. ఢిల్లీ బౌలర్ల దెబ్బకి పంజాబ్ కుదేలైంది. ఢిల్లీ ముందు స్వల్ప స్కోరు నమోదు చేసింది.
బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న పోరులో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఆ జట్టును కరోనా భయపెడితే.. పంజాబ్ ను మాత్రం ఢిల్లీ బౌలర్లు వణికించారు. ఢిల్లీ బౌలర్ల దెబ్బకి పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. జితేష్ శర్మ (23 బంతుల్లో 32 పరుగులు ; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 24 పరుగులు ; 4 ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ని ఢిల్లీ బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆ జట్టుపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ధావన్ లలిత్ యాదవ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో, 33 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత కాసేపటికే పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్(24) ముస్తాఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ
తర్వాత ఫామ్ లో ఉన్న లివింగ్ స్టోన్ ఔటవ్వడంతో పంజాబ్ మరింత కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ స్టంపౌటయ్యాడు. దీంతో, 46 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 54 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన బెయిర్ స్టో.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ముస్తాఫిజర్ రెహ్మన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొంచెం సేపు జితేష్ , షారుఖ్ ఖాన్ వికెట్ల పతనాన్నిఅడ్డుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే, మంచి టచ్ లో కన్పించిన జితేష్ శర్మ(32)ని అక్షర్ పటేల్ ఔట్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఇక, ఆ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది పంజాబ్. కగిసో రబాడా (2), నాథన్ ఎల్లీస్ (0) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యారు. ఇక, షారుఖ్ ఖాన్ (12) ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇక, 12 పరుగులు చేసిన రాహుల్ చాహర్.. లలిత్ యాదవ్ బౌలింగ్ లో పావెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఆఖర్లో అరకొర బౌండరీ సాధించి పంజాబ్ కి ఈ మాత్రం స్కోరు అందించారు టెయిలెండర్లు.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), మహ్మద్ షారుఖ్ ఖాన్, కగిసొ రబడ, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.