Home /News /sports /

IPL 2022 DC VS PBKS LIVE SCORE UPDATES DELHI CAPITALS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD

IPL 2022 - DC vs PBKS : టాస్ గెలిచిన ఢిల్లీ.. కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

IPL 2022 - DC vs PBKS

IPL 2022 - DC vs PBKS

IPL 2022 - DC vs PBKS : ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్టు.

    ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కాసేపట్లో మరో ఆసక్తికరపోరుకు తెరలేవనుంది. కరోనా అల్లోకల్లోలం మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, కరోనా బారిన పడ్డ మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, గత మ్యాచులో దూరమైన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తిరిగి జట్టులో చేరాడు. అలాగే, ఓడియన్ స్మిత్ స్థానంలో నాథన్ ఎల్లీస్ ని తుది జట్టులోకి తీసుకుంది పంజాబ్ కింగ్స్.నిజానికి ఈ మ్యాచ్ పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో షెడ్యూల్ చేసినప్పటికీ.. కోవిడ్ కారణంగా దీన్ని ముంబైకి తరలించింది బీసీసీఐ. ఢిల్లీ టీమ్ క్వారంటైన్‌లో ఉన్నందున పుణేకు ట్రావెల్ చేయలేకపోయింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నంతగా రాణించడం లేదు.

    ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్లు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కలకలం రేపడం.. జట్టు గెలుపోటములపై ప్రభావాన్ని చూపించవచ్చు. మిచెల్ మార్ష్ సహా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. లేటెస్ట్ గా మరో స్టార్ ఆటగాడు కూడా వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.

    పేపర్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ.. మైదానంలో దిగిన తర్వాత ఆ స్థాయిలో రాణించట్లేదు. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ మాత్రమే సత్తా చాటుతున్నారు. పావెల్, లలిత్ యాదవ్ అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. బౌలింగ్ లో శార్దూల్, ఖలీల్ అహ్మద్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ముస్తఫిజుర్ రహ్మాన్ గత మ్యాచులో విఫలమయ్యాడు. అక్షర్ పటేల్ అయితే.. ఈ సీజన్ లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. వీరందరూ కచ్చితంగా రాణిస్తేనే ఢిల్లీకి విజయావకాశాలు ఉంటాయ్.

    పంజాబ్ కింగ్స్ కూడా పేపర్ మీద బలంగానే కన్పిస్తోంది. మయాంక్ అగర్వాల్ శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, షారుఖ్ ఖాన్, ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్ ఉన్నా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఫుల్ ఎనర్జీతో ఆడట్లేదు. లియామ్ లివింగ్‌స్టొన్ ఒక్కడే దుమ్ము రేపుతున్నాడు. వరుసగా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను రబడ లీడ్ చేస్తోన్నాడు. ఒడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌లతో బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్ గానే ఉంది.

    తుది జట్లు :

    పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), మహ్మద్ షారుఖ్ ఖాన్, కగిసొ రబడ, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

    ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రౌమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Delhi Capitals, IPL 2022, Punjab kings, Rishabh Pant, Shikhar Dhawan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు