ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ జట్టుని వణికించింది. బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లో దడదడలాడించింది. 116 పరుగుల స్వల్ప టార్గెట్ మరో 57 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 116 పరుగుల టార్గెట్ ను 10.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి అందుకుంది. తొమ్మిది వికెట్ల తేడా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 60 పరుగులు నాటౌట్ ; 10 ఫోర్లు, 1 సిక్సర్), పృథ్వీ షా (20 బంతుల్లో 41 పరుగులు ; 7 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు బ్యాటింగ్ తో ఢిల్లీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ అందుకుంది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మాత్రమే వికెట్ దక్కించుకున్నాడు. ఢిల్లీకి ఈ సీజన్ లో ఇది మూడో విజయం. మరోవైపు, పంజాబ్ కి ఇది నాలుగో పరాజయం. దీంతో.. పాయింట్ల టేబుల్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 116 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్. ఈ ఇద్దరూ పోటీపడి మరీ పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు.
బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అన్నట్టు సాగింది ఈ ఇద్దరి బ్యాటింగ్. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరూ ఆ తర్వాత కూడా దూకుడు ఆపలేదు. దీంతో, పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్లు ఏమీ కోల్పోకుండా 81 పరుగులు చేసింది. రబాడా, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్ వీరిద్దరి ధనాధన్ బ్యాటింగ్ ముందు తేలిపోయారు.
What a way to return to winning ways! 👏 👏@DelhiCapitals put up a dominant show & sealed a clinical 9⃣-wicket win over #PBKS. 👌 👌
Scorecard ▶️ https://t.co/3MYNGBm7Dg#TATAIPL | #DCvPBKS pic.twitter.com/6YpYU4bh18
— IndianPremierLeague (@IPL) April 20, 2022
అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రాహుల్ చాహర్ విడదీశాడు. 41 పరుగులు చేసిన పృథ్వీ షా.. భారీ షాట్ కు యత్నించి బౌండరీ మీద నాథన్ ఎల్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 83 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. పృథ్వీ షా ఔటైన వార్నర్ మాత్రం తన దూకుడు ఆపలేదు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో విజయాన్ని సంపూర్ణం చేశాడు.
అంతకుముందు.. ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఆ జట్టును కరోనా భయపెడితే.. పంజాబ్ ను మాత్రం ఢిల్లీ బౌలర్లు వణికించారు. ఢిల్లీ బౌలర్ల దెబ్బకి పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. జితేష్ శర్మ (23 బంతుల్లో 32 పరుగులు ; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 24 పరుగులు ; 4 ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, IPL 2022, Prithvi shaw, Punjab kings, Rishabh Pant, Shikhar Dhawan