IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అద్బుత ఫీల్డింగ్ విన్యాసాలు క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. క్యాచ్ లతో పాటు బౌండరీ లైన్ దగ్గర సూపర్ డైవ్ లతో ఫోర్లు, సిక్సర్లను ఆపుతూ తమ జట్ల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్లేయర్ రోవ్ మన్ పావెల్ సూపర్ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే పావెల్ ఫీల్డింగ్ తోనే మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యింది. అనంతరం ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 17 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఇది కూడా చదవండి : వామ్మో హార్దిక్ నీ దగ్గర ఈ ట్యాలెంట్ కూడా ఉందా? 'వై దిస్ కొలవరి' అంటూ రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్
160 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ను ఢిల్లీ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు సూపర్ బౌలింగ్ తో కట్టడి చేశారు. వీరి ధాటికి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది. అయితే తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతోన్న జితేశ్ శర్మ (44) సూపర్ బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. 17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 7 వికెట్లకు 121 పరుగులు చేసింది. గెలవాలంటే పంజాబ్ 18 బంతుల్ల ో39 పరుగులు చేయాలి. ఇదేమి కష్టసాధ్యమైన లక్ష్యం ఏమీ కాదు. అందులోనూ జితేశ్ శర్మ అప్పటికే మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారీ సిక్సర్లతో ఆడుతున్నాడు. శార్దుల్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని జితేశ్ లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి సిక్సర్ చేరేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న పావెల్.. గాల్లోకి ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్ కాకుండా చేశాడు. ఫలితంగా ఐదు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Rovman Powell saved 5 crucial runs for DC with this magnificent effort 😍
📸: Disney+Hotstar#IPL #IPL2022 #delhicapitals #punjabkings #YehHaiNayiDilli pic.twitter.com/gyXnViCAf6
— Sportskeeda (@Sportskeeda) May 16, 2022
సిక్సర్ అని భావించిన జితేశ్ శర్మ.. పావెల్ ఫీల్డింగ్ తో కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. అదే ఓవర్ లో జితేశ్ శర్మ వార్నర్ పట్టిన సూపర్ క్యాచ్ కు పెవలియన్ కు చేరాడు. ఆ తర్వాత ధాటిగా ఆడే బ్యాటర్స్ లేక పంజాబ్ కింగ్స్ 17 పరుగుల తేడాతో ఓటమిని ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఓడటంతో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi capital, Delhi Capitals, IPL, IPL 2022, Mumbai Indians, Punjab kings, Rishabh Pant, Rohit sharma, Sunrisers Hyderabad