IPL 2022 DC VS LSG DELHI CAPITALS CAPTAIN RISHABH PANT FINE INR 12 LAKH FOR SLOW OVER RATE AGAINST LUUCKNOW SUPERGIANTS SJN
IPL 2022: ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ కు భారీ షాక్... ఏకంగా రూ. 12 లక్షలు...
రిషభ్ పంత్ (ఫైల్ ఫోటో)
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (luucknow supergiants) చేతిలో ఓడిపోయి తీవ్ర బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ (Rishbh Pant)పై ఏకంగా రూ. 12 లక్షల రూపాయల ఫైన్ ను విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు.
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ (luucknow supergiants) చేతిలో ఓడిపోయి తీవ్ర బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ (Rishbh Pant)పై ఏకంగా రూ. 12 లక్షల రూపాయల ఫైన్ ను విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఆగ్రహించిన మ్యాచ్ రిఫరీ... కెప్టెన్ రిషభ్ పంత్ పై కొరడా ఝుళిపించాడు. స్లో ఓవర్ రేట్ ఇది తొలిసారి కావడంతో రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజు నుంచి మాత్రమే జరిమానా విధించారు. ఇది రెండోసారి రిపీట్ అయితే మాత్రం... ఆటగాళ్ల ఫీజులోంచి కూడా కోత పడుతుంది.
స్లో ఓవర్ రేట్ జరిమానా వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్లో ఓవర్ రేట్ అనేది చాలా సాధారణంగా నమోదయ్యే అంశం. అయితే దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బీసీసీఐ గత ఏడాది నుంచి కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అవేంటంటే?
తొలిసారి నమోదైతే : ఐపీఎల్ నియమావళి ప్రకారం తొలిసారి స్లో ఓవర్ రేట్ ను నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్ పై రూ. 12 లక్షల ఫైన్ ను విధిస్తారు. అయితే ఇందులో ఆటగాళ్ల ఫీజులో ఎటువంటి కోత ఉండదు.
రెండోసారి నమోదైతే : రెండోమారు పునరావృతమైతే సదరు కెప్టెన్ మ్యాచ్ ఫీజు నుంచి రూ. 24 లక్షలను జరిమానాగా విధిస్తారు. అలాగే తుది జట్టులోని ప్రతి ఆటగాడిపై రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా పడుతుంది.
మూడోసారి నమోదైతే : ఒకే సీజన్లో సదరు కెప్టెన్ మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే రూ. 30 లక్షలు జరిమానాతో పాటు తదుపరి ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదర్కోవలసి ఉంటుంది. అలాగే తుది జట్టు ఆటగాళ్లపై రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా విధిస్తారు.
ఇక డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం లక్నో, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన పోరులో లక్నో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఓ దశలో లక్నో ఈజీగా గెలిచేలా కన్పించింది. అయితే, డికాక్ ఔట్ తర్వాత.. మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి మ్యాచ్ మీద ఆసక్తి పెంచారు. అయితే, ముస్తఫిజుర్ రహ్మన్ వేసిన 19 ఓవర్ లో కృనాల్ పాండ్యా 14 పరుగులు పిండుకున్నాడు. దీంతో, ఆఖరి ఓవర్ లో 5 పరుగులు అవసరమయ్యాయ్. ఆఖరి ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని ఫోర్, సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ లక్నో సొంతమైంది. ఆయుష్ మూడు బంతుల్లో పది పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని లక్నో టీం మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయి ఛేదించి విజయాన్ని అందుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.