IPL 2022 DAVID WARNER DAUGHTER DAVID WARNER DAUGHTERS UPSET AFTER THEIR FATHER DISMISSED AGAINST RCB SJN
IPL 2022: ’అయ్యో నాన్న ఎందుకు అవుటయ్యావ్.?‘ వార్నర్ కూతుర్ల క్యూట్ రియాక్షన్..
వార్నర్ కూతర్లు (ఎడమ, కుడి) (PC: TWITTER)
IPL 2022: మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ (david warner) కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్ లా నిలిచారు. మ్యాచ్ లో వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇఛ్చాడు. తొలుత పృథ్వీ షా (16)తో కలిసి తొలి వికెట్ కు 50 పరుగులు జోడించాడు.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో శనివారం జరిగిన డబుల్ హెడర్స్ మ్యాచ్ లు అభిమానులకు కావల్సినంత కిక్ ను ఇచ్చాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) విజయం సాధిస్తే.. రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్ లు క్రికెట్ లవర్స్ కు వినోదాన్ని పంచినా.. రాత్రి జరిగిన ఆర్సీబీ, ఢిల్లీ మ్యాచ్ మరింత కిక్కును ఇచ్చింది. తొలుత మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ లు మెరుపులు మెరిపిస్తే... ఆ తర్వాత వార్నర్, రిషభ్ పంత్ దంచి కొట్టారు. అయితే కీలక సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత క్యాచ్ తో మ్యాచ్ ను ఆర్సీబీ వైపునకు తిప్పాడు.
అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ (david warner) కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్ లా నిలిచారు. మ్యాచ్ లో వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇఛ్చాడు. తొలుత పృథ్వీ షా (16)తో కలిసి తొలి వికెట్ కు 50 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో వార్నర్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే హసరంగ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే ప్రేక్షకులు స్టాండ్స్ నుంచి మ్యాచ్ ను చూస్తోన్న వార్నర్ కూతుర్లు ఐవీ మే, ఇండీ రే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ తండ్రి అవుటయ్యాడని తెగ బాధ పడిపోయారు. ఐవీ అయితే మొహాన్ని చేతులతో దాచుకొని తెగ బాధపడిపోయింది. ’ఎందుకు నాన్న అవుటయ్యావ్‘ అన్నట్లు ఇద్దరు కూడా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వార్నర్ దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురు కూడా ఆడపిల్లలే కావడం విశేషం. 2015లో కాండీస్ ను వార్నర్ వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరికి ఐవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్ జన్మించారు. గత రెండేళ్ల వరకు కూడా వార్నర్ గురించి కానీ, అతడి ఫ్యామిలీ గురించి కానీ భారతీయులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఎప్పుడైతే వార్నర్ తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి వార్నర్ ఫ్యామిలీకి ఇండియాలో క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానులకు వార్నర్ అంటే కూడా... డేవిడ్ బాయ్ అనే తెలుసు. అంతలా వార్నర్ ను తెలుగు అభిమానులు అరాధిస్తారు. అయతే 2021 సీజన్ తర్వాత టీంతో విబేధాల కారణంగా వార్నర్ సన్ రైజర్స్ ను వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ... ఆరెంజ్ ఆర్మీ వార్నర్ ను అభిమానిస్తూనే ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.