హోమ్ /వార్తలు /క్రీడలు /

SRH vs CSK : టాస్ గెలిచిన సన్ రైజర్స్.. చెన్నై టీంలోకి కొత్త పెళ్లి కొడుకు

SRH vs CSK : టాస్ గెలిచిన సన్ రైజర్స్.. చెన్నై టీంలోకి కొత్త పెళ్లి కొడుకు

ధోని వర్సెస్ విలియమ్సన్ (ఫైల్ ఫోటోస్)

ధోని వర్సెస్ విలియమ్సన్ (ఫైల్ ఫోటోస్)

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane williamson) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్ రైజర్స్ జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగించనుంది. మరోవైపు సీజన్ ఆరంభానికి ముందు సారథిగా తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని () ఈ మ్యాచ్ తో మళ్లీ కెప్టెన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చెన్నై జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఫిట్ గా లేని శివమ్ దూబే, డ్వేన్ బ్రావోలను పక్కన పెట్టిన చెన్నై.. వారి స్థానాల్లో సిమ్రన్ జిత్ సింగ్, డెవోన్ కాన్వేలను తుది జట్టులోకి తీసుకుంది.

పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి అనంతరం శనివారం రవీంద్ర జడేజా తన కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. తిరిగి ధోనికే ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొనడం విశేషం. ఇక చెన్నై టీంలో ఇటీవలె పెళ్లి చేసుకున్న డెవోన్ కాన్వేకు అవకాశం ఇవ్వడం విశేషం. అతడు లీగ్ ఆరంభం మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. అనంతరం బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక సన్ రైజర్స్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన వాళ్లకే మరోసారి అవకాశం ఇచ్చింది. ఆ మ్యాచ్ లో మార్కో యాన్సెన్ ఆఖరి ఓవర్లో ఏకంగాా 26 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతడికి సన్ రైజర్స్ మరోసారి అవకాశం ఇచ్చింది. బలాల పరంగా చూస్తే సన్ రైజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. ఉమ్రాన్ మాలిక్ ను చెన్నై జట్టు ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా ధోని వర్సెస్ ఉమ్రాన్ మాలిక్ పోరు అభిమానులకు వినోదాన్ని పంచడం ఖాయం.

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప,  డెవోన్ కాన్వే, అంబటి రాయుడు, సిమ్రన్ జిత్ సింగ్, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), మిచెల్ సాంట్నెర్, తీక్షణ

సన్ రైజర్స్ హైదరాబాద్

అభిశేఖ్ శర్మ, విలియమ్సన్ (కెప్టెన్), త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్, సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్  మాలిక్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kane Williamson, MS Dhoni, Ravindra Jadeja, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు