హోమ్ /వార్తలు /క్రీడలు /

SRH vs CSK : సన్ రైజర్స్ బౌలర్లను ఉతికారేసిన చెన్నై ఓపెనర్లు..పాపం రుతురాజ్.. హైదరాబాద్ ముందు టఫ్ టోటల్

SRH vs CSK : సన్ రైజర్స్ బౌలర్లను ఉతికారేసిన చెన్నై ఓపెనర్లు..పాపం రుతురాజ్.. హైదరాబాద్ ముందు టఫ్ టోటల్

రుతురాజ్, కాన్వే (PC : IPL)

రుతురాజ్, కాన్వే (PC : IPL)

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) భారీ స్కోరును సాధించింది.

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కొత్త పెళ్లి కొడుకు డెవోన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సన్ రైజర్స్ బౌలర్లను దంచి కొట్టారు. దాంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ధోని  (8) విఫలం అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిగిలిన బౌలర్లందరూ కూడా ఓవర్ కు 10 పరుగుల చొప్పున ఇచ్చారు.

ఇది కూడా చదవండి : ఆవేశంతో ఊగిపోయిన గౌతం గంభీర్.. కారణం అదేనా? వీడియో వైరల్

సూపర్ ఓపెనింగ్

పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుండటంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు తొలి బంతి నుంచి సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. చెన్నై ఇన్నింగ్స్ లో వీరి బ్యాటింగే హైలైట్ గా నిలిచింది. భువనేశ్వర్ కుమార్ ను తప్పించి మిగిలిన బౌలర్లను వీరు ఉతికి ఆరేశారు. రుతురాజ్ ఏకంగా ఆరు సిక్సర్లు ఆరు ఫోర్లతో హైదరాబాద్ బౌలర్లపై శివతాండవం ఆడాడు. మరో ఎండ్ లో ఉన్న కాన్వే కూడా నెమ్మదిగా తన బ్యాట్ కు పని చెప్పాడు. వీరి ధాటికి చెన్నై స్కోరు 250 పరుగులు దాటేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో కమ్ బ్యాక్ చేసిన సన్ రైజర్స్ బౌలర్లు ప్రత్యర్ధిని కట్టడి చేయగలిగారు. సెంచరీకి చేరువయ్యే కొద్ది రుతురాజ్ ఆట మందగించింది. అయితే 99 పరుగుల వద్ద రుతురాజ్ అవుటయ్యాడు. దాంతో సెంచరీని పరుగు తేడాతో మిస్ అయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన ధోని ఒక్క ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. ఫలితంగా చెన్నై చేయాల్సిన పరుగుల కంటే ఒక 50 పరుగులు తక్కువకే పరిమితమైంది.

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప,  డెవోన్ కాన్వే, అంబటి రాయుడు, సిమ్రన్ జిత్ సింగ్, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), మిచెల్ సాంట్నెర్, తీక్షణ

సన్ రైజర్స్ హైదరాబాద్

అభిశేఖ్ శర్మ, విలియమ్సన్ (కెప్టెన్), త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్, సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్  మాలిక్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, Csk, IPL, IPL 2022, Kane Williamson, MS Dhoni, Ravindra Jadeja, SRH, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు