హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK vs SRH : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచిందోచ్.. రూ. 6.5 కోట్లకి న్యాయం చేసిన అభిషేక్..

IPL 2022 - CSK vs SRH : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచిందోచ్.. రూ. 6.5 కోట్లకి న్యాయం చేసిన అభిషేక్..

IPL 2022 - CSK vs SRH : హమ్మయ్య ఎట్టేకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో బోణి కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే అందుకుంది ఆరెంజ్ ఆర్మీ.

ఇంకా చదవండి ...

  హమ్మయ్య ఎట్టేకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో బోణి కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే అందుకుంది ఆరెంజ్ ఆర్మీ. దీంతో, ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో బోణీ కొట్టి.. పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రూ.6.5 కోట్ల ఆటగాడు అభిషేక్ శర్మ తన డబ్బుకి మొదటి సారి న్యాయం చేశాడు. అభిషేక్​ శర్మ 50 బంతుల్లో 75 పరుగులతో రాణించాడు. విలియమ్సన్​ 40 బంతుల్లో 32 పరుగులతో.. శర్మకు చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో త్రిపాఠి 15 బంతుల్లో 39 రన్స్​తో చెలరేగాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్​ చౌదరి, డ్వేన్​ బ్రేవోకు చెరో వికెట్​ దక్కింది. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. చెన్నైకి ఇది ఈ సీజిన్​లో వరుసగా నాలుగో ఓటమి.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. మొదట్లో ఇన్నింగ్స్ ను నిదానంగా మొదలుపెట్టింది.

  కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ , మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆచితూచి ఆడారు. 5 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆ తర్వాత అభిషేక్ శర్మ తన షాట్లతో ఆకట్టుకున్నాడు. దొరికిన చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ స్కోరు బోర్డు ఒత్తిడి లేకుండా చేశాడు. అయితే, 40 బంతుల్లో 32 పరుగులు చేసిన కేన్‌ విలియమ్సన్‌ ముకేశ్‌ చౌదరీ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, 89 పరుగుల విలువైన భాగస్యామ్యానికి బ్రేక్ పడింది.

  ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి రావడం రావడంతోనే విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా మంచి షాట్లతో అలరించాడు. అయితే.. 75 పరుగులు చేసిన తర్వాత.. బ్రావో బౌలింగ్ లో జోర్డాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి మిగతా పని పూర్తి చేసి ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి మొదటి విజయాన్ని అందించాడు.

  తొలుత టాస్​ గెలిచిన సన్​రైజర్స్​ చెన్నైకి బ్యాటింగ్​ అప్పగించింది. దీంతో, చెన్నైనిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మొయిన్ అలీ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23 పరుగులు; 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Kane Williamson, Ravindra Jadeja, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు