హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK vs SRH : టాస్ హైదరాబాద్ దే.. SRH లోకి చాకు లాంటి ఆల్ రౌండర్.. చెన్నైలోకి మిస్టరీ స్పిన్నర్..

IPL 2022 - CSK vs SRH : టాస్ హైదరాబాద్ దే.. SRH లోకి చాకు లాంటి ఆల్ రౌండర్.. చెన్నైలోకి మిస్టరీ స్పిన్నర్..

IPL 2022 - CSK vs SRH : ముఖాముఖి పోరులో చెన్నై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు జరగ్గా అందులో 12 మ్యాచ్ ల్లో చెన్నై విజయం సాధించింది. మరో నాలుగింటిలో సన్ రైజర్స్ గెలిచింది. గత ఆరు మ్యాచ్ ల్లోనూ చెన్నై 4 సార్లు గెలవగా... హైదరాాబాద్ 2 సార్లు మాత్రమే గెలిచింది.

ఇంకా చదవండి ...

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో ఇప్పటి వరకు బోణీ కొట్టని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), సన్ రైజర్స్ హైదరాాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య కాసేపట్లో కీలక పోరు జరగనుంది. ముంబై (Mumbai)లోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్లు బోణీ కోసం పోటా పోటీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది ఆరెంజ్ ఆర్మీ. జట్టులోకి శశాంక్ సింగ్, సఫారీ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ వచ్చాడు. సమద్, రొమెరియా షెపర్డ్ లపై వేటు పడింది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ప్రిటోరియెస్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ మహేష్ తీక్షణ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.కొత్త సారథి రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నాయకత్వంలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల హ్యాట్రిక్ ను పూర్తి చేయగా... కేన్ విలియమ్సన్ (Kane Williamson) సారథిగా ఉన్నసన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది.

  కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. మొదట రాజస్థాన్‌, ఆ తర్వాత లఖ్‌నవూ చేతిలో భంగపడ్డ హైదరాబాద్‌ సీజన్‌లో తొలి విజయం కోసం తహతహలాడుతోంది. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ. 7.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్ పై వేటు పడింది.

  ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ షెపర్డ్ బౌలింగ్ లో రాణించినా బ్యాట్ తో సత్తా చాటలేకపోయాడు. కీలక సమయాల్లో బ్యాట్ తో విఫలమై టీమ్ మేనేజ్ మెంట్ ను నిరాశ పరిచాడు. దాంతో ఇతడి స్థానంలో సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జన్సెన్ తుది జట్టులోకి అవకాశం వచ్చింది. కేన్ విలియమ్సన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. నికోలస్ పూరన్ కూడా మెరుపులు మెరిపించాల్సి ఉంది. ఇక, అభిషేక్ శర్మకి ఇదే లాస్ట్ ఛాన్స్. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తే ఫలితం ఉంటుంది.

  ఇక ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిన చెన్నై పరిస్థితి కూడా ఏం బాగాలేదు. రుతురాజ్ ఫామ్ లో లేకపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అదే సమయంలో రాబిన్ ఉతప్ప నిలకడగా ఆడకపోవడం జట్టుకు సమస్యగా మారింది. ఇక జడేజా కెప్టెన్సీలో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. మొయిన్ అలీ, రవీంద్ర జడేజా లయ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  శివమ్ దూబే తన ఫామ్ కంటిన్యూ చేయాలి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చాలా బలహీనంగా కనబడుతోంది. ప్రిటోరియస్, జోర్డాన్ కాస్త ఫర్వాలేదన్పిస్తున్నారు. అయితే, ప్రిటోరియస్ స్థానంలో మహేష్ తీక్షణ కు తుదిజట్టులో చోటు దక్కింది. జడేజా బౌలింగ్ లో కూడా ప్రభావం చూపడం లేదు. ఐపీఎల్ టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే చెన్నై ఆటతీరు ఇక నుంచి అయినా మారాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లోనూ ఓడితే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతూ వస్తాయి.

  ముఖాముఖి

  ముఖాముఖి పోరులో చెన్నై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు జరగ్గా అందులో 12 మ్యాచ్ ల్లో చెన్నై విజయం సాధించింది. మరో నాలుగింటిలో సన్ రైజర్స్ గెలిచింది. గత ఆరు మ్యాచ్ ల్లోనూ చెన్నై 4 సార్లు గెలవగా... హైదరాాబాద్ 2 సార్లు మాత్రమే గెలిచింది.

  తుది జట్లు :

  సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్ రమ్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రన్ మాలిక్

  చెన్నై సూపర్ కింగ్స్ : రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ధోని, శివమ్ దూబే, మొయిన్ అలీ, మహేష్ తీక్షణ, బ్రావో, జోర్డాన్, ముఖేశ్ చౌదరి

  First published:

  Tags: Chennai Super Kings, IPL 2022, Kane Williamson, MS Dhoni, Ravindra Jadeja, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు