హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK vs SRH : నట్టూ, సుందర్ అదుర్స్.. చెన్నైను ఆదుకున్న అలీ.. SRH ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - CSK vs SRH : నట్టూ, సుందర్ అదుర్స్.. చెన్నైను ఆదుకున్న అలీ.. SRH ముందు ఫైటింగ్ టోటల్..

Sunrisers Hyderabad (IPL Twitter)

Sunrisers Hyderabad (IPL Twitter)

IPL 2022 - CSK vs SRH : ముఖాముఖి పోరులో చెన్నై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు జరగ్గా అందులో 12 మ్యాచ్ ల్లో చెన్నై విజయం సాధించింది. మరో నాలుగింటిలో సన్ రైజర్స్ గెలిచింది. గత ఆరు మ్యాచ్ ల్లోనూ చెన్నై 4 సార్లు గెలవగా... హైదరాబాద్ 2 సార్లు మాత్రమే గెలిచింది.

ఇంకా చదవండి ...

  డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మొయిన్ అలీ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23 పరుగులు; 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 4వ ఓవర్‌ తొలి బంతికే రాబిన్‌ ఊతప్ప (11 బంతుల్లో 15; ఫోర్‌) ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఉతప్ప పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా మరోసారి నిరాశపర్చాడు.

  యార్కర్ల కింగ్‌ నటరాజన్‌ అద్భుతమైన బంతితో రుతురాజ్‌ (13 బంతుల్లో 16; 3 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. నట్టూ వేసిన పర్ఫెక్ట్‌ ఇన్‌ స్వింగింగ్‌ యార్కర్‌కు రుతురాజ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో 36 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మొయిన్ అలీ, అంబటి రాయుడు చెన్నైను ఆదుకున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్లారు. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నారు.

  అయితే, స్కోర్‌ వేగం పెంచే క్రమంలో అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి రాయుడు పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో, మూడో వికెట్ కు 62 పరుగుల పార్టనర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కాసేపటికే మొయిన్ అలీ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటవ్వడంతో సీఎస్కే కష్టాలు మరింత పెరిగాయ్. అలీ.. మార్క్రమ్ బౌలింగ్ లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శివమ్ దూబేను నట్టూ బోల్తా కొట్టించాడు. కేవలం మూడు పరుగులు చేసిన శివమ్ దూబే.. ఉమ్రన్ మాలిక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ధోని (3 పరుగులు) కూడా నిరాశపర్చాడు. మార్కస్ జాన్సెన్ బౌలింగ్ లో ఉమ్రన్ మాలిక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో జడేజా ఒకటి రెండు షాట్లు ఆడటంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

  ముఖాముఖి

  ముఖాముఖి పోరులో చెన్నై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు జరగ్గా అందులో 12 మ్యాచ్ ల్లో చెన్నై విజయం సాధించింది. మరో నాలుగింటిలో సన్ రైజర్స్ గెలిచింది. గత ఆరు మ్యాచ్ ల్లోనూ చెన్నై 4 సార్లు గెలవగా... హైదరాాబాద్ 2 సార్లు మాత్రమే గెలిచింది.

  తుది జట్లు :

  సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్ రమ్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రన్ మాలిక్

  చెన్నై సూపర్ కింగ్స్ : రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ధోని, శివమ్ దూబే, మొయిన్ అలీ, మహేష్ తీక్షణ, బ్రావో, జోర్డాన్, ముఖేశ్ చౌదరి

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Kane Williamson, Ravindra Jadeja, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు