IPL 2022 CSK VS SRH CHENNAI SUPER KINGS CAPTAIN MS DHONI ANGRY ON MUKESH CHOUDHARY FOR BOWLING WIDE AGAINST SUNRISERS HYDERABAD SJN
MS Dhoni : ’మైండ్ దొబ్బిందా.. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావ్‘ బౌలర్ ముఖేష్ పై ధోని ఫైర్..
ధోని ఆగ్రహం (PC : TWITTER)
MS Dhoni : MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సహనం కోల్పోయాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా కూల్ గా కనిపించే ధోని.. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు.
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సహనం కోల్పోయాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా కూల్ గా కనిపించే ధోని.. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 202 పరుగుల చేసి సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్ ను నిర్ధేశించగలిగింది. ఛేదన ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కిందా మీదా పడుతూ లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఒక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచేలా కనిపించింది కూడా. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
చివరి ఓవర్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించాలంటే 38 పరుగులు చేయాలి. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న పూరన్ 6 బంతులకు 6 సిక్సర్లు బాదినా హైదరాబాద్ గెలవలేదు. ఆఖరి ఓవర్ ను అప్పటికే 4 వికెట్లు తీసిన ముఖేశ్ చౌదరికి ఇచ్చాడు ధోని. తొలి రెండు బంతులకు 10 పరుగులు సమర్పించుకున్నాడు. అదే సమయంలో ముఖేశ్ చౌదరి వైడ్ వేయడంతో ఆగ్రహానికి గురైన ధోని.. ’మైండ్ పనిచేయడం లేదా. ఎందుకు అలా చేస్తున్నావ్. వికెట్ టు వికెట్ బౌలింగ్ చెయ్యి చాలు‘ అంటూ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆఖరి ఓవర్లో నికోలస్ పూరన్ 24 పరుగులు రాబట్టాడు. అయినా కూడా అది సన్ రైజర్స్ జట్టు గెలుపును ఖాయం చేయలేకుండా పోయింది. చెన్నై జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కొత్త పెళ్లి కొడుకు డెవోన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సన్ రైజర్స్ బౌలర్లను దంచి కొట్టారు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ధోని (8) విఫలం అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిగిలిన బౌలర్లందరూ కూడా ఓవర్ కు 10 పరుగుల చొప్పున ఇచ్చారు.
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో64 నాటౌట్; 3 సిక్సర్లు, 6 ఫోర్లు) హైదరాబాద్ విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడాడు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి నాలుగు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.