హోమ్ /వార్తలు /క్రీడలు /

SRH vs CSK : సన్ రైజర్స్ బలం సరిపోలేదు.. మాస్టర్ మైండ్ తో చెన్నైని గట్టెక్కించిన ధోని

SRH vs CSK : సన్ రైజర్స్ బలం సరిపోలేదు.. మాస్టర్ మైండ్ తో చెన్నైని గట్టెక్కించిన ధోని

విజయానందంలో చెన్నై టీం (PC : IPL)

విజయానందంలో చెన్నై టీం (PC : IPL)

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈ సీజన్ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన హైదరాబాద్ ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి అదరగొట్టింది.

ఇంకా చదవండి ...

SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈ సీజన్ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన హైదరాబాద్ ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి అదరగొట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన గత మ్యాచ్ లో ఆఖరి బంతికి ఓడిపోయిన సన్ రైజర్స్.. తాజాగా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలోనూ ఓడిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో హైదరాబాద్ పై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ లో కెప్టెన్ గా ధోనికిదే తొలి మ్యాచ్ కావడం విశేషం.

203 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో64 నాటౌట్; 3 సిక్సర్లు, 6 ఫోర్లు) హైదరాబాద్ విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడాడు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి నాలుగు వికెట్లు తీశాడు.

చెన్నై జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కొత్త పెళ్లి కొడుకు డెవోన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సన్ రైజర్స్ బౌలర్లను దంచి కొట్టారు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ధోని  (8) విఫలం అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిగిలిన బౌలర్లందరూ కూడా ఓవర్ కు 10 పరుగుల చొప్పున ఇచ్చారు.

పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుండటంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు తొలి బంతి నుంచి సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. చెన్నై ఇన్నింగ్స్ లో వీరి బ్యాటింగే హైలైట్ గా నిలిచింది. భువనేశ్వర్ కుమార్ ను తప్పించి మిగిలిన బౌలర్లను వీరు ఉతికి ఆరేశారు. రుతురాజ్ ఏకంగా ఆరు సిక్సర్లు ఆరు ఫోర్లతో హైదరాబాద్ బౌలర్లపై శివతాండవం ఆడాడు. మరో ఎండ్ లో ఉన్న కాన్వే కూడా నెమ్మదిగా తన బ్యాట్ కు పని చెప్పాడు. వీరి ధాటికి చెన్నై స్కోరు 250 పరుగులు దాటేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో కమ్ బ్యాక్ చేసిన సన్ రైజర్స్ బౌలర్లు ప్రత్యర్ధిని కట్టడి చేయగలిగారు. సెంచరీకి చేరువయ్యే కొద్ది రుతురాజ్ ఆట మందగించింది. అయితే 99 పరుగుల వద్ద రుతురాజ్ అవుటయ్యాడు. దాంతో సెంచరీని పరుగు తేడాతో మిస్ అయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన ధోని ఒక్క ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. ఫలితంగా చెన్నై చేయాల్సిన పరుగుల కంటే ఒక 50 పరుగులు తక్కువకే పరిమితమైంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, IPL, IPL 2022, Kane Williamson, MS Dhoni, Ravindra Jadeja, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు