హోమ్ /వార్తలు /క్రీడలు /

CSK vs RCB : చెలరేగిన సిరాజ్, హేజల్ వుడ్.. రాజస్తాన్ ఢమాల్.. ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

CSK vs RCB : చెలరేగిన సిరాజ్, హేజల్ వుడ్.. రాజస్తాన్ ఢమాల్.. ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PC: IPL)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PC: IPL)

CSK vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటింగ్ విఫలమైంది.

ఇంకా చదవండి ...

CSK vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం పుణేలోని ఎంసీఏ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటింగ్ విఫలమైంది. హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed siraj) ఆరంభంలోనే వికెట్లు తీసి రాజస్తాన్ ను ఒత్తిడిలోకి నెట్టగా.. ఆ తర్వాత హేజల్ వుడ్ కూడా చెలరేగాడు. సిరాజ్, హేజల్ వుడ్ చెరో రెండు వికెట్లు తీశాడు. రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడని రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. తనపై వస్తున్న విమర్శలు, మీమ్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్ల)తో కెరీర్ లోనే తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీని అందుకున్నాడు.

సిరాజ్ సూపర్

టాస్ ఓడి రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కు దిగగా.. పిచ్ పై బౌన్స్ ఉండటంతో దానిని బెంగళూరు జట్టు బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తన వరుస ఓవర్లలో దేవదత్ పడిక్కల్ (8),  రవిచంద్రన్ అశ్విన్ (17)లను సిరాజ్ అవుట్ చేశాడు. గత రెండు మ్యాచ్ ల్లోనూ సెంచరీలతో విరుచుకుపడ్డ జాస్ బట్లర్ (8)ని హేజల్ వుడ్ పెవలియన్ కు చేర్చాడు. ఇక క్రీజులో ఉన్నంత వరకు ధాటిగా ఆడిన కెప్టెన్ సంజూ సామ్సన్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు)ను హసరంగ అద్భుత గూగ్లీకి క్లీన్ బౌల్డ్ చేయడంతో రాజస్తాన్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

దంచి కొట్టిన రియాన్ పరాగ్

గత ఏడు మ్యాచ్ ల్లో చెత్త ప్రదర్శనతో అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్న రియాన్ పరాగ్ ఒక మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గత ఏడు మ్యాచ్ ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేసిన అతడికి వరుస అవకాశాలు కల్పించడంపై సోషల్ మీడియాల్లో రాజస్తాన్ రాయల్స్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే అతడిని మరోసారి బ్యాకప్ చేసిన రాజస్తాన్.. అతడి నుంచి వచ్చిన తాజా ఇన్నింగ్స్ తో ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన పరాగ్ భారీ షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హసరంగా క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన అతడు.. ఐపీఎల్ లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు రాజస్తాన్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు