Home /News /sports /

IPL 2022 CSK VS PBKS PUNJAB KINGS BOWLER RISHI DHAWAN WEARS HEAD MASK AND BOWLED PICS GOES VIRAL SJN

IPL 2022 : ఐపీఎల్ లో వింత.. హెడ్ మాస్క్ తో పంజాబ్ కింగ్స్ బౌలర్.. దాని ఉపయోగాలు తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే..

రిషి ధావన్ (PC: TWITTER)

రిషి ధావన్ (PC: TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ వింతలు విశేషాలకు వేదికలుగా నిలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్ రిషి ధావన్ హెడ్ మాస్క్ తో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. అరోరా స్థానంలో పంజాబ్ కింగ్స్ తుది జట్టులోకి వచ్చిన రిషి ధావన్.. 5వ ఓవర్ వేయడానికి బౌలింగ్ కు వచ్చాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ వింతలు విశేషాలకు వేదికలుగా నిలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్ రిషి ధావన్ హెడ్ మాస్క్ తో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. అరోరా స్థానంలో పంజాబ్ కింగ్స్ తుది జట్టులోకి వచ్చిన రిషి ధావన్.. 5వ ఓవర్ వేయడానికి బౌలింగ్ కు వచ్చాడు. అయితే అందరు బౌలర్లలా రాకుండా.. హెల్మెంట్ లాంటి దానిని తన తలకు ధరించి బౌలింగ్ కు వచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాటర్ కొట్టే షాట్ తలకు తగిలినా ఏం కాకూడదు అనే ఉద్దేశంతో రిషి ధావన్ ఈ హెడ్ మాస్క్ ను వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : అతడికంత సీన్ లేదు.. రషీద్ ఖాన్ పై సన్ రైజర్స్ కోచ్ సంచలన కామెంట్స్

గ్లాస్ లాంటి దానితో తయారు చేసిన ఈ హెడ్ మాస్క్ తల, ముక్కు వంటి బాగాలను కవర్ చేస్తోంది. బంతి వేగంగా వచ్చి బౌలర్ కు తగిలినా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇది నివారించే అవకాశం ఉంది. అయితే ఇండియాలో ఒక బౌలర్ హెడ్ మాస్క్ వాడటం కొత్త కానీ.. వేరే దేశాల్లో ఇటువంటి మాస్క్ లతో పలువురు బౌలింగ్ చేశారు.





2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన దేశవాళీ టోర్నీలో వారెన్ ఇటువంటి మాస్క్ నే ధరించి బౌలింగ్ చేశాడు. దానిని మాస్క్ అని అనడం కంటే కూడా హెల్మెంట్ అంటే బాగుంటుందేమో. ఇక ఇటువంటి హెడ్ మాస్క్ లను మనం ఎక్కువగా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ క్రీడల్లో చూస్తుంటాం. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూజ్ మరణం తర్వాత అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. బ్యాటర్లకు హెల్మెంట్ ఉంటుంది కానీ, బౌలర్లు మాత్రం ఎటువంటి రక్షణ లేకుండానే బౌలింగ్ చేస్తారు. ఒకవేళ బ్యాటర్ స్ట్రయిట్ గా కొట్టిన సమయంలో దాదాపు 100 కుపైగా కి.మీ వేగంతో బంతి వచ్చి బౌలర్ ను తగిలే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో అనుకోనిది ఏదైనా జరిగితే అతడి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. భారత్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో బుమ్రా కొట్టిన బంతి ఇంగ్లండ్ బౌలర్ ను బలంగా తాకుతుంది. లక్కీగా అతడికేం జరగలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, Csk, IPL, IPL 2022, MS Dhoni, Punjab kings, Ravindra Jadeja, Shikhar Dhawan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు