Home /News /sports /

IPL 2022 CSK VS PBKS PUNJAB KINGS BEAT CHENNAI SUPER KINGS BY 11 RUNS SJN

CSK vs PBKS : పని చేయని ధోని లాస్ట్ ఓవర్ మ్యాజిక్.. రాయుడి సూపర్ ఇన్నింగ్స్ వృథా.. గెలుపు పంజాబ్ దే..

రబడ, రిషి ధావన్ (PC: IPL)

రబడ, రిషి ధావన్ (PC: IPL)

CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో థ్రిల్లర్ లాంటి మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను అలరించింది. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)పై 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇంకా చదవండి ...
CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో థ్రిల్లర్ లాంటి మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను అలరించింది. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)పై 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆఖరి ఓవర్ లో చెన్నై విజయానికి 27 పరుగుల అవసరం కాగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో  ధోని ఉన్నాడు. దాంతో ముంబై పై లాస్ట్ ఓవర్ లో ఆడినట్లే ఆడి ధోని జట్టుకు విజయాన్ని అందిస్తాడని అంతా భావించారు. అంతే కాకుండా గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ పై ఆఖరి ఓవర్లో చెలరేగినట్లు ఈ రోజు కూడా చెలరేగుతాడని భావించిన ప్రేక్షకులకు చివరకు నిరాశే ఎదురైంది.

రిషి ధావన్ వేసిన 20వ ఓవర్ తొలి బంతిని ధోని భారీ సిక్సర్ బాదాడు.  అయితే ఆ తర్వాత యార్కర్లతో వైవిధ్యం చూపిన రిషి ధావన్ ధోనిని పెవిలియన్ కు చేర్చాడు. రవీంద్ర జడేజా ఒక సిక్సర్ బాదినా అది చెన్నై విజయాన్ని ఖాయం చేయలేకపోయింది.  188 పరుగుల లక్ష్యంతో  బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. అంబటి రాయుడు (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. పంజాబ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో రాయుడి చేతికి గాయం అయ్యింది. దాంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఛేదనలో గాయంతోనే ఆడిన రాయుడు అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా రాయుడు వల్లనే చెన్నై మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ (30) పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి : బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సచిన్ గారాల కూతురు..! బీ టౌన్ లో జోరుగా ప్రచారం..

శిఖర్ ధావన్ (59 బంతుల్లో 88 నాటౌట్ ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ (7 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో చెన్నై ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోరును ఉంచగలిగింది. ఐపీఎల్ లో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కు ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా శిఖర్ ధావన్ పలు మైలు రాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ లో 6 వేల పరుగులను పూర్తి చేసుకోవడంతో పాటు చెన్నై పై 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, IPL, IPL 2022, MS Dhoni, Punjab kings, Shikhar Dhawan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు