హోమ్ /వార్తలు /క్రీడలు /

CSK vs PBKS : భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన శిఖర్ ధావన్.. ప్రత్యర్ధి ముందు టఫ్ టార్గెట్ సెట్ చేసిన పంజాబ్

CSK vs PBKS : భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన శిఖర్ ధావన్.. ప్రత్యర్ధి ముందు టఫ్ టార్గెట్ సెట్ చేసిన పంజాబ్

శిఖర్ ధావన్ (PC: IPL)

శిఖర్ ధావన్ (PC: IPL)

CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (59 బంతుల్లో 88 నాటౌట్ ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు.

ఇంకా చదవండి ...

CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (59 బంతుల్లో 88 నాటౌట్ ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ (7 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో చెన్నై ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోరును ఉంచగలిగింది. ఐపీఎల్ లో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కు ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా శిఖర్ ధావన్ పలు మైలు రాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ లో 6 వేల పరుగులను పూర్తి చేసుకోవడంతో పాటు చెన్నై పై 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీశాడు.

గబ్బర్ ధనాధన్

గత రెండు మ్యాచ్ ల్లో ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ (18) శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. మయాంక్ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సతో కలిసి ధావన్ జట్టును ముందుకు నడిపించాడు. రాజపక్స ఇచ్చిన పలు క్యాచ్ లను చెన్నై ఫీల్డర్లు జారవిడిచారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 110 పరుగులు జోడించారు. రాజపక్స అవుటయ్యాక వచ్చిన లివింగ్ స్టోన్ ప్రిటోరియస్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. దాంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరును అందుకుంది. మరో ఎండ్ లో ఉన్న శిఖర్ ధావన్ చూడ చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత నెమ్మదిగా ఆడిన అతడు అనంతరం రెచ్చిపోయాడు. ఆఫ్ సైడ్ అద్భుతంగా షాట్లు ఆడటంతో పాటు ఫైన్ లెగ్ మీదుగా కూడా కొన్ని షాట్లు ఆడాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ కెరీర్ లో 46వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పిచ్ స్లోగా ఉన్నా.. శిఖర్ ధావన్ మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

తుది జట్లు 


చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మిచెల్  శాంట్నర్, శివం దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (కెప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి.


పంజాబ్ కింగ్స్‌: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టొన్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్,   కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

First published:

Tags: Ambati rayudu, Chennai Super Kings, Csk, IPL, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Punjab kings, Ravindra Jadeja, Shikhar Dhawan

ఉత్తమ కథలు