IPL 2022 CSK VS PBKS CHENNAI SUPER KINGS WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN
CSK vs PBKS : రాజుల సమరంలో టాస్ నెగ్గిన చెన్నై.. భారీ మార్పులు చేసిన పంజాబ్.. ఆ పవర్ హిట్టర్ పై వేటు
మయాంక్ వర్సెస్ జడేజా (PC: IPL)
CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మరికాసేపట్లో రాజుల మధ్య సమరం ఆరంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మరికాసేపట్లో రాజుల మధ్య సమరం ఆరంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో తాము బౌలింగ్ ఎంచుకున్నట్లు జడేజా పేర్కొన్నాడు. చెన్నై ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉండగా.. గత రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పంజాబ్ కింగ్స్ డీలా పడింది. చెన్నై ఎటువంటి మార్పులు లేకుండానే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుండగా.. పంజాబ్ మాత్రం మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ ల్లో విఫలమైన ఎలీస్, షారుఖ్ ఖాన్, అరోరా స్థానాల్లో రిషి ధావన్, భానుక రాజపక్స, సందీప్ శర్మలను తుది జట్టులోకి తీసుకుంది.
షారుఖ్ పై వేటు
పవర్ హిట్టర్లతో భయంకరంగా కనిపించిన పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా ఓడిపోయింది. సన్ రైజర్స్ తో తొలుత ఓడిన పంజాబ్... ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తదుపరి మ్యాచ్ లోనూ ఓడింది. దాంతో ఆడిన ఏడు మ్యాచ్ ల్లో నాలుగింటిలో ఓడి మూడింటిలో గెలిచింది. వేలంలో రూ కోట్లకు కోట్లు పోసి కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ పై పంజాబ్ వేటు వేసింది. ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ అతడు తన ప్రభావం చూపలేకపోయాడు. దాంతో అతడిపై వేటు వేసిన టీం బౌలింగ్ ఆల్ రౌండర్ రిషి ధావన్ ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఈ సీజన్ లో ఈ ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ జరగ్గా అందులో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఉంది. ముంబై తో జరిగిన మ్యాచ్ లో ధోని సూపర్ ఫినిష్ తో ఆ జట్టు గెలవడంతో మరోసారి మహేంద్రుడిపై ఆ జట్టు ఆధారపడనుంది. ఓపెనర్ గా రుతురాజ్ కూడా రాణించాల్సి ఉంది. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబేలతో చెన్నై పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై పేవరెట్ గా బరిలోకి దిగనుంది.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టొన్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.