పొలార్డ్ కోసం ఫీల్డ్ సెట్ చేసిన ధోని (PC: TWITTER)
IPL 2022: క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనిని (MS Dhoni) మాస్టర్ మైండ్ అని ఊరికే అనలేదు. చెస్ లో ప్లేయర్స్ ఎలా అయితే ఎత్తులకు పైఎత్తులు వేస్తారో.. క్రికెట్ లో కూడా ధోని అదే చేస్తాడు. అందుకే అతడిని మాస్టర్ మైండ్ అనేది. ఒక బౌలర్ ను ఎప్పుడు ఉపయోగించుకోవాలి.. ప్రత్యర్థికి ఎలా ఫీల్డ్ సెట్ చెయ్యాలి అనే విషయాలు ధోనికి తెలిసినంతగా ఎవరీకి తెలిసి ఉండవు అనేది సుస్పష్టం.
IPL 2022: క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనిని (MS Dhoni) మాస్టర్ మైండ్ అని ఊరికే అనలేదు. చెస్ లో ప్లేయర్స్ ఎలా అయితే ఎత్తులకు పైఎత్తులు వేస్తారో.. క్రికెట్ లో కూడా ధోని అదే చేస్తాడు. అందుకే అతడిని మాస్టర్ మైండ్ అనేది. ఒక బౌలర్ ను ఎప్పుడు ఉపయోగించుకోవాలి.. ప్రత్యర్థికి ఎలా ఫీల్డ్ సెట్ చెయ్యాలి అనే విషయాలు ధోనికి తెలిసినంతగా ఎవరీకి తెలిసి ఉండవు అనేది సుస్పష్టం. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) జట్టుకు పేరుకు మాత్రమే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కెప్టెన్. కానీ, వ్యూహాలను పన్నడంలో.. ఫీల్డ్ సెట్ చేయడంలో అన్నీ ధోనియే చూసుకుంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. ధోని డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డ్ సెట్ చేసి అతడి వికెట్ ను సాధిస్తాడు. వాస్తవానికి అంతకుముందు బంతి వరకు కూడా ఫీల్డర్ స్క్వేర్ లెగ్ లో ఉంటాడు. కానీ, సరిగ్గా బంతి పడే సమయానికి డీప్ స్క్వేర్ లెగ్ లోకి రావాల్సిందిగా.. ఆ ఫీల్డర్ కు ధోని సైగ చేస్తాడు. విరాట్ నేరుగా అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకుంటాడు.
తాజాగా ఇటువంటి సంఘటనే మరోసారి ఐపీఎల్ లో చోటు చేసుకుంది. అయతే ఈసారి ఫీల్డర్ ను సెట్ చేయడంతో పాటు పొలార్డ్ ఇగోతో కూడా ధోని ఆడుకున్నాడు. అదెలా అంటే.. ముంబై బ్యాటింగ్ చేస్తోండగా.. మహీశ్ తీక్షన వేసిన బౌలింగ్ లో పొలార్డ్ బౌలర్ నెత్తి మీదుగా సిక్సర్ బాదాడు. పొలార్డ్ ఎక్కువగా స్ట్రయిట్ గా షాట్లు ఆడుతుంటాడు. దాంతో.. పొలార్డ్ ను అవుట్ చేయడం కోసం ధోని మాస్టర్ ప్లాన్ వేశాడు. లాంగాన్, లాంగాఫ్ లలో ఫీల్డర్లు ఉన్నా.. స్ట్రయిట్ గా శివమ్ దూబే ను మొహరించాడు. ఎదురుగా ఫీల్డర్ కనిపిస్తున్నా.. పొలార్డ్ స్ట్రయిట్ గా సిక్సర్ బాదడానికే మొగ్గు చూపాడు. అంటే ఇక్కడు పొలార్డ్.. ధోనికి ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే.. నువ్వు ఎంతమంది ఫీల్డర్లను ఉంచినా.. వారిపైనుంచి కొడతా అన్నట్లు పొలార్డ్ ఆ షాట్ ఆడాడు. అయితే అతడి లెక్క తప్పి నేరుగా ఫీల్డర్ చేతిలో చిక్కాడు.
అయితే పొలార్డ్ ఇలా ధోని బుట్టలో పడటం ఇదేమీ తొలిసారి కాదు. 2010 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా పొలార్డ్ కోసం ధోని ఈ విధంగానే ఫీల్డ్ ను సెట్ చేశాడు. లాంగాఫ్ లో రైనాను మొహరించిన ధోని.. 30 యార్డ్ సర్కిల్ లోపల స్ట్రయిట్ గా హెడెన్ ను ఉంచాడు. అల్బీ మోర్కెల్ బౌలింగ్ చేయగా... స్ట్రయిట్ గా ఆడబోయిన పొలార్డ్ హెడెన్ చేతికి చిక్కాడు. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇప్పుడు ధోని ఫ్యాన్స్ ఈ రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియా వేదికల్లో ధోని మాస్టర్ మైండ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లోనూ ముంబై జట్టు ఓడిపోయింది. దాంతో ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ ఓడిన ముంబై.. ప్లే ఆఫ్స్ కు దూరమైంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.