Home /News /sports /

IPL 2022 CSK VS MI LIVE SCORE UPDATES MUNBAI INDIANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD

IPL 2022 - CSK vs MI : టాస్ గెలిచిన ముంబై.. పొలార్డ్ కు టాటా.. అతని స్థానంలో ఎవరంటే..

IPL 2022 - CSK vs MI

IPL 2022 - CSK vs MI

IPL 2022 - CSK vs MI : ముఖాముఖి పోరులో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. ముంబైదే పై చేయి. రోహిత్ సేన 19 సార్లు నెగ్గగా.. 14 సార్లు ధోని సేన విజయ కేతనం ఎగురవేసింది.

    ఐపీఎల్ 2022 సీజన్‌ లో మరికాసేపట్లో బ్లాక్ బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయ్. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. పొలార్డ్ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే, మురుగన్ అశ్విన్ స్థానంలో హృతిక్ సోకిన్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరున్న ఈ రెండు జట్లు అత్యంత చెత్త ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపర్చాయ్.

    ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంతలో కొంత బెటర్. 11 మ్యాచ్‌ల్లలో నాలుగింట్లో విజయాలను అందుకుంది. అదే 11 మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 91 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు కొంత మెరుగుపడ్డాయి. ముంబై ఇండియన్స్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై అదే రేంజ్ రన్‌రేట్‌తో విజయం సాధించగలిగితే అద్భుతం జరిగే అవకాశాలు లేకపోలేదు. చెన్నై జట్టులో ఓపెనర్లు సూపర్ టచ్ లో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు.

    డేవాన్ కాన్వే.. అద్బుతంగా ఆడుతున్నాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లలో 85,56,87 పరుగులు చేసి బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. మిడిలార్డర్‌లో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివం దూబే తిరిగి లయ అందుకోవాల్సి ఉంది. మొయిన్ అలీ, ధోనిలు ఫర్వాలేదన్పిస్తున్నారు. సీఎస్కే బౌలింగ్ విభాగం మంచి టైంలో ఫామ్ లోకి వచ్చింది. మహీష్ తీక్షణ, డ్వేన్ బ్రావో, ముఖేష్ చౌదరి, మొయిన్ అలీ, సిమ్రన్ జీత్ సింగ్ కీలకం కానున్నారు.

    మరోవైపు.. ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో రెండింటినే గెలిచింది. చివరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ఫర్వాలేదన్పిస్తున్నారు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాల్సి ఉంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరుకు ఓ భారీ స్కోరు కూడా రాలేదు.

    కనీసం హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోయాడు టీమిండియా కెప్టెన్. సూర్యకుమార్ యాదవ్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం దెబ్బకొట్టింది. కీరన్ పొలార్డ్ అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ఫామ్ లోకి రావడం ప్లస్ పాయింట్. డానియల్ సామ్స్, కుమార కార్తీకేయ, రిలే మెరిడిత్ బౌలింగ్ లో కీలకం కానున్నారు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ముఖాముఖి పోరులో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. ముంబైదే పై చేయి. రోహిత్ సేన 19 సార్లు నెగ్గగా.. 14 సార్లు ధోని సేన విజయ కేతనం ఎగురవేసింది.

    తుది జట్లు :

    చెన్నై సూపర్ కింగ్స్‌ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, సిమ్రన్ జీత్ సింగ్, మహీస్ తీక్షణ, ముఖేష్ చౌదరి

    ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్‌
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు