Home /News /sports /

IPL 2022 CSK VS MI LIVE SCORE UPDATES CHENNAI SUPER KINGS ALL OUT FOR RUNS AND MUMBAI INDIANS BRILLIANT BOWLING SRD

IPL 2022 - CSK vs MI : చెన్నైని వణికించిన ముంబై బౌలర్లు.. ధోని ఒక్కడే వారియర్.. ముంబై టార్గెట్ ఇదే..

Mumbai Indians (IPL Twitter)

Mumbai Indians (IPL Twitter)

IPL 2022 - CSK vs MI : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై బ్యాటర్లు నిరాశపర్చారు. ముంబై బౌలర్లు ధాటికి కకావికలమయ్యారు. ధోని రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

    వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో చెన్నైని ముంబై బౌలర్లు వణికించారు. ముంబై బౌలర్లు ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 16 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో ధోని ( 33 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిగతా వారు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లు తీయగా.. మెరిడిత్, కార్తికేయ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా, రమణ్ దీప్ చెరో ఓ వికెట్ తీశారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డెవాన్ కాన్వే, మోయిన్‌ అలీ డకౌట్‌గా వెనుదిరిగారు. ధోనిసేనను దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు ఓపెనర్ డేవాన్ కాన్వే తొలి ఓవర్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాల్ లెగ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్నట్టు కన్పించింది. స్టేడియంలో పవర్ కట్ వల్ల DRS కోరుకునేందుకు కాన్వేకు అవకాశం దక్కలేదు. దీంతో.. అతడు నిరాశగానే వెనుదిరిగాడు. అటు ఊతప్ప సైతం ఎల్బీ కాగా.. DRSకు ఛాన్స్ దక్కలేదు.

    అయితే, ఊతప్ప క్లియర్ గా ఔట్ గా కన్పించింది. పవర్ కట్ వల్ల టాస్ కూడా ఆలస్యమైంది. ఆ తర్వాత కాసేపటికే 5 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో.. 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, 17 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన గైక్వాడ్‌.. సామ్స్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 29 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రాయుడు.. మెరిడిత్‌ బౌలింగ్‌లో కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

    ఇక, 39 పరుగుల వద్ద శివమ్ దూబే (10) రిలే మెరిడిత్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ కు క్యాచ్ చ్చి ఔటయ్యాడు. దీంతో.. 39 పరుగులకే ఆరు వి​కెట్లు కోల్పోయి సీఎస్‌కే పీకల్లోతు కష్టాల్లో పడింది. కష్టాల్లో పడ్డ.. చెన్నై ఇన్నింగ్స్ ని ధోని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒకటి రెండు షాట్లతో స్కోరు బోర్డును ముందుకుతీసుకువెళ్లాడు. అయితే.. మరో ఎండ్ లో ధోనికి సహకరించే వారే కరువయ్యారు. ఇక.. డ్వేన్ బ్రావో(12), సిమిర్‌జీత్‌ సింగ్‌(2).. కుమార్‌ కార్తీకేయ వేసిన ఒకే ఓవర్‌లో అవుటయ్యారు. దీంతో.. 80 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 81 పరుగుల వద్ద.. రమణ్ దీప్ సింగ్ బౌలింగ్ లో రోహిత్ కి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు మహీష్ తీక్షణ్. ఆఖర్లో ధోని మెరుపులు మెరిపించినా.. జట్టు స్కోరు వంద పరుగులు దాటలేదు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ముఖాముఖి పోరులో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. ముంబైదే పై చేయి. రోహిత్ సేన 19 సార్లు నెగ్గగా.. 14 సార్లు ధోని సేన విజయ కేతనం ఎగురవేసింది.

    తుది జట్లు :

    చెన్నై సూపర్ కింగ్స్‌ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, సిమ్రన్ జీత్ సింగ్, మహీస్ తీక్షణ, ముఖేష్ చౌదరి

    ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్‌
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Jasprit Bumrah, MS Dhoni, Mumbai Indians, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు