Home /News /sports /

IPL 2022 CSK VS MI LIVE SCORE DUE TO POWER OUTAGE IN WANKHADE STADIUM DEVON CONWAY DENIED DRS HELP SRD

IPL 2022 - CSK vs MI : అయ్యో.. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు.. CSKని కొంపముంచిన పవర్ కట్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2022 - CSK vs MI : ముఖాముఖి పోరులో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. ముంబైదే పై చేయి. రోహిత్ సేన 19 సార్లు నెగ్గగా.. 14 సార్లు ధోని సేన విజయ కేతనం ఎగురవేసింది.

    ఐపీఎల్ 2022 సీజన్‌ లో చెన్నై, ముంబైల మధ్య జరుగుతున్న పోరులో ధోనిసేనను దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు ఓపెనర్ డేవాన్ కాన్వే తొలి ఓవర్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాల్ లెగ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్నట్టు కన్పించింది. స్టేడియంలో పవర్ కట్ వల్ల DRS కోరుకునేందుకు కాన్వేకు అవకాశం దక్కలేదు. దీంతో.. అతడు నిరాశగానే వెనుదిరిగాడు. అటు ఊతప్ప సైతం ఎల్బీ కాగా.. DRSకు ఛాన్స్ దక్కలేదు. అయితే, ఊతప్ప క్లియర్ గా ఔట్ గా కన్పించింది. పవర్ కట్ వల్ల టాస్ కూడా ఆలస్యమైంది. కాసేపటి క్రితం కరెంట్ రావడంతో డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై షాకుల మీద షాకులు తగిలాయ్. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. డానియల్స్ సామ్స్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, రిలే మెరిడిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం క్రీజులో ధోని, ఊతప్ప ఉన్నారు.

    ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. పొలార్డ్ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే, మురుగన్ అశ్విన్ స్థానంలో హృతిక్ సోకిన్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.ఒకవేళ.. ఈ మ్యాచులో చెన్నై ఓడిపోతే.. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు చూస్తుంటే.. ముంబై విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఐపీఎల్ లోనే రెండు విజయవంతమైన జట్టు ఇలా నిరాశపర్చడం ఫ్యాన్స్ ను కలిచి వేస్తోంది.


    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ముఖాముఖి పోరులో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. ముంబైదే పై చేయి. రోహిత్ సేన 19 సార్లు నెగ్గగా.. 14 సార్లు ధోని సేన విజయ కేతనం ఎగురవేసింది.

    తుది జట్లు :

    చెన్నై సూపర్ కింగ్స్‌ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, సిమ్రన్ జీత్ సింగ్, మహీస్ తీక్షణ, ముఖేష్ చౌదరి

    ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్‌
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Rohit sharma

    తదుపరి వార్తలు