హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK vs LSG : టాస్ లక్నోదే.. మూడు కీలక మార్పులతో బరిలోకి చెన్నై.. రూ.8 కోట్ల ఆటగాడు వచ్చేశాడు..

IPL 2022 - CSK vs LSG : టాస్ లక్నోదే.. మూడు కీలక మార్పులతో బరిలోకి చెన్నై.. రూ.8 కోట్ల ఆటగాడు వచ్చేశాడు..

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

    ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. కీ ఫైట్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌, కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (CSK vs LSG) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై లక్నో తరుఫున అరంగేట్రం చేయనున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. మొయిన్ అలీ, ప్రెటోరియస్, ముఖేష్ చౌదరి జట్టులోకి వచ్చారు. కాన్వే, ఆడమ్ మిల్నే, మిచెల్ శాంట్నర్ పై వేటు పడింది. రూ.8 కోట్ల ఆటగాడు మొయిన్ అలీ రావడం చెన్నైకి ప్లస్ పాయింట్.

    గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన సీఎస్​కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసి లీగ్​లోకి ప్రవేశించింది. కానీ తొలి మ్యాచ్​లోనే ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్​లో 131 పరుగులే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం మాజీ సారథి ధోనీ తప్ప మిగతా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, రాబిన్​ ఉతప్ప, డేవాన్ కాన్వే, అంబటి రాయుడు చేతులెత్తేశారు. కొత్త సారథి రవీంద్ర జడేజా, శివమ్​ దుబే కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. వీళ్లందరూ సత్తా చాటితే చెన్నైకి తిరుగుండదు.

    అయితే మొయిన్​ అలీ తిరిగి జట్టులోకి చేరడం, చెన్నైకి కలిసొచ్చే అంశం. వీసా స‌మస్యల‌తో తొలి మ్యాచ్‌కు దూర‌మైన చెన్నైసూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు. దీంతో తొలి మ్యాచ్‌లో ఆడిన న్యూజిలాండ్ ఆట‌గాడు డేవాన్‌ కాన్వేను ఈ మ్యాచ్‌కు దూరం పెట్టింది. ఇక బౌల‌ర్లుగా డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ప్రిటోరియస్ కీలకం కానున్నారు. ఈ జ‌ట్లులో ఆల్‌రౌండ‌ర్లుగా కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా, మొయిన్ అలీ, బ్రావో వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

    ఈ ఏడాది లీగ్​లోకి అరంగేట్రం చేసిన లక్నో సూపర్​ జెయింట్స్​ జట్టు.. తొలి మ్యాచ్​లోనే మరో కొత్త జట్టు గుజరాత్​ చేతిలో చతికిలబడింది. ముఖ్యంగా కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, డికాక్​ ఇద్దరూ తమ బ్యాటింగ్​తో అభిమానులను నిరాశపరిచారు. బ్యాటర్లు మనీశ్​ పాండే, ఎవిన్​ లూయిస్​ చేతులెత్తేయడం వల్ల స్కోరు బోర్డు ముందుకు సాగలేదు. వీరు తమ బ్యాటింగ్​లో లయను అందుకోవాలి. గత మ్యాచ్​లో అద్భుతంగా ఆడిన దీపక్​ హుడా(55), ఆయుశ్​ బదోని(54) ఈ సారి కూడా రాణించాలి.

    బౌలింగ్​లో పేసర్​ చమీరా ఫర్వాలేదనపించగా, మరో పేసర్​ అవేశ్​ ఖాన్​ 3.4 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, హుడా,కృనాల్‌ కూడా రాణించాలి. జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయాన్ని అందుకుంటుంది. ఇక, జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ఆండ్రూ టైని తీసుకుంది. మోహిన్సన్ ఖాన్ ప్లేస్ లో అతన్ని జట్టులోకి తీసుకుంది.

    తుది జ‌ట్లు :

    చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, రవీంద్ర జ‌డేజా(కెప్టెన్‌) , శివ‌మ్ దూబే, మ‌హేంద్ర‌సింగ్ ధోని (వికెట్ కీప‌ర్‌), డ్వేన్ బ్రావో, డ్వాయిన్ ప్రెటోరియస్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే.

    ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), ఇవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా, చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, ఆండ్రూ టై, ర‌వి బిష్ణోయ్.

    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Ravindra Jadeja

    ఉత్తమ కథలు