హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK vs LSG : దంచుడే దంచుడు.. కనికరం లేకుండా ఉతికారేసిన చెన్నై.. లక్నో ముందు భారీ టార్గెట్..

IPL 2022 - CSK vs LSG : దంచుడే దంచుడు.. కనికరం లేకుండా ఉతికారేసిన చెన్నై.. లక్నో ముందు భారీ టార్గెట్..

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

IPL 2022 - CSK vs LSG : ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

  బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కనికరం లేకుండా లక్నో బౌలర్లను ఉతికారేశారు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. రాబిన్ ఊతప్ప (27 బంతుల్లో 50 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్), శివమ్ దూబే ( 30 బంతుల్లో 49 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్ అలీ ( 22 బంతుల్లో 35 పరుగులు ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (20 బంతుల్లో 27 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా ( 9 బంతుల్లో 17 పరుగులు), ధోని ( 6 బంతుల్లో 16 పరుగులు) మెరుపులు మెరిపించారు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సీఎస్‌కే తమ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. మొదటి రెండు ఓవర్లలో 26 పరుగులు చేసింది. ముఖ్యంగా ఊతప్ప లక్నో బౌలర్లను ఉతికారేశాడు.

  అయితే, రుతురాజ్‌ గైక్వాడ్‌(1) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా గైక్వాడ్‌ షాట్‌ ఆడాడు. అయితే సింగిల్‌ కోసం ప్రయత్నించి రవి బిష్ణోయి డైరెక్ట్‌ త్రోకు రనౌట్‌ అయ్యాడు. రుతురాజ్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగినప్పటికి.. సీఎస్‌కే దూకుడైన ఆటతీరుతో చెలరేగింది. తొలి పవర్‌ ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 73 పరుగులు చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రాబిన్ ఊతప్ప. అయితే, 84 పరుగుల వద్ద సీఎస్కే రెండో వి​కెట్‌ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రాబిన్‌ ఊతప్ప.. బిష్ణోయి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

  ఆ తర్వాత మొయిన్ అలీ, శివమ్ దూబే లు ఇద్దరూ ధాటిగా ఆడారు. అయితే, 35 పరుగులు చేసిన మొయిన్‌ అలీ.. అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో, 106 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రాయుడు కూడా తగ్గేదేలే అన్నట్టుగా చెలరేగాడు. శివమ్ దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కు శివమ్ దూబే, రాయుడు ఆరవై పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, 20 బంతుల్లో 27 పరుగులు చేసిన రాయుడు రవి బిష్ణోయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో, 166 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది.

  తుది జ‌ట్లు :

  చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, రవీంద్ర జ‌డేజా(కెప్టెన్‌) , శివ‌మ్ దూబే, మ‌హేంద్ర‌సింగ్ ధోని (వికెట్ కీప‌ర్‌), డ్వేన్ బ్రావో, డ్వాయిన్ ప్రెటోరియస్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే.

  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), ఇవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా, చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, ఆండ్రూ టై, ర‌వి బిష్ణోయ్.

  First published:

  Tags: Chennai Super Kings, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, MS Dhoni, Ravindra Jadeja

  ఉత్తమ కథలు