IPL 2022 CSK VS KKR PREVIEW HEAD TO HEAD RECORDS KEY PLAYERS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SHREYAS IYER VS RAVINDRA JADEJA SRD
IPL 2022 - CSK vs KKR : శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జడేజా.. కెపెన్లుగా ఇద్దరికీ సవాలే.. తొలి ధమాకాలో తుది జట్లు ఇవే..!
CSK vs KKR
IPL 2022 - CSK vs KKR : టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. గతేడాది ఫైనల్ లో ఎదురైన పరాభవానికి లెక్క సరిచేయాలని కేకేఆర్ భావిస్తుండగా.. అదే జోరు కంటిన్యూ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహపడుతోంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా చూస్తున్న సమయం రానే వచ్చింది. క్రికెట్ కుంభమేళా ఐపీఎల్ 2022 (IPL 2022)కి కౌంట్ డౌన్ షూరు అయింది. మరో కొద్ది గంటల్లో క్రికెట్ పండగ ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ ధమాకాలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), శ్రేయాస్ అయ్యర్ (Shreya Iyer) కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలబడబోతున్నాయి. ఇప్పటికే రెండు టీంలు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. గతేడాది ఫైనల్ లో ఎదురైన పరాభవానికి లెక్క సరిచేయాలని కేకేఆర్ భావిస్తుండగా.. అదే జోరు కంటిన్యూ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్ల అంచనాపై ఓ లుక్కేద్దాం.
ఐదోసారి ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలనుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ను ప్రత్యర్థుల కంటే కూడా సొంత ప్లేయర్సే ఎక్కవగా భయపెడుతున్నారు. వేలంలో ఏరి కోరి రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చహర్... గాయంతో ఐపీఎల్ లో ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అతడు కోలుకున్నప్పటికీ.. తిరిగి పూర్తిగా ఫామ్‌లోకి వచ్చాడా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. అటు వీసా జాప్యత కారణంగా ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. గాయం కారణంగా పేస్ బౌలర్ దీపక్ చాహార్ మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నారు. అలాగే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు సారధ్య బాధ్యతలు ఇవ్వడంతో.. చెన్నైకి అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది.
ఇక ఆల్ రౌండర్లుగా శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో కీలకం కానున్నారు. బౌలింగ్ లో మాత్రం కొంచెం వీక్ గా కన్పిస్తోంది. దీపక్ చాహర్ దూరమవ్వడంతో ఆ ప్లేస్ భర్తీ చేసే బౌలర్ కన్పించడం లేదు. ఆడమ్ మిల్నే , ఆసిఫ్ బౌలింగ్ బాధ్యతలు మోసే ఛాన్సుంది. జోర్డాన్, శాంటర్న్ ల్లో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
మరోవైపు, యువ రక్తానికి.. అనుభవసారాన్ని జోడించిన కోల్‌కతా.. ముచ్చటగా మూడో టైటిల్ పట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడకనబరుస్తున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు జట్టు పగ్గాలు అప్పగించిన ఫ్రాంచైజీ.. వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైన్, కమిన్స్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.
అటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్.. ఇంటర్నేషనల్ డ్యూటీస్ కారణంగా మొదటి ఐదు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అయితేనేం.. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ జట్టు మాత్రం ఎలాగైనా మొదటి మ్యాచ్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆ జట్టు రాత మారడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యరే ఇప్పుడు కోల్‌కతాకు అతి పెద్ద బలం. గాయంతో గత సీజన్ ఫస్టాఫ్‌కు దూరమైన తనకు.. సెకండాఫ్‌లో తిరిగి కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో శ్రేయస్ అలిగి ఆ జట్టును వీడాడు. ఇప్పుడు టీమిండియా తరఫున అదరగొట్టి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా పగ్గాలు చేపడుతున్నాడు.కొన్నేళ్లుగా కోల్‌కతాను ఇబ్బంది పెడుతున్న కెప్టెన్సీ సమస్య శ్రేయస్ వల్ల తీరిపోయినట్లే.
బ్యాటర్ గా కూడా అతడిది కీలక పాత్ర. వెస్టిండీస్ తో వన్డే, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ లో గొప్పగా రాణించిన అతడు.. ఈ లీగ్ లోనూ బ్యాట్ కు పనిచెబితే జట్టుకు తిరుగుండదు.ఇక, అయ్యర్‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ వెంకటేశ్, రసెల్ ఈ టీమ్ స్టార్ పెర్ఫామర్స్ అనడంలో సందేహం లేదు. భారత పిచ్‌లపై జోరు చూపించే స్పిన్నర్లు వరుణ్, నరైన్ టీమ్‌కు కొండంత అండ.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఐపీఎల్ లో రెండు జట్లు మొత్తంగా 28 సార్లు తలపడ్డాయ్. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ దే పై చేయి. చెన్నై 19 సార్లు నెగ్గగా.. కోల్ కతా మరో 9 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.